విమానంలో ప్రయాణికులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. వివరాల్లోకి వెళితే.. ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టర్కీస్ ఎయిర్‌లైన్స్ విమానం మరో గంటలో న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుందనగా విమానంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది.

ప్రయాణికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో విమానంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని, మిగిలిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 32 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.