ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో  ప్రయాణీకుల బస్సుకు నిప్పంటుకొని 13 మంది మృతి చెందారు.

హైద్రాబాద్ నుండి కరాచీకి 20 మంది ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది.  దీంతో బస్సుకు మంటలు అంటుకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులోని 13 మంది అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు.  ఈ బస్సులో ప్రయాణీస్తున్న మరో ఐదుగురి పరిస్థితి కూడ విషమంగా ఉంది.

ఈ ప్రమాదం నుండి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.  బస్సు నుండి కాలిపోయిన మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు.బస్సు అతి వేగంతో ప్రయాణీస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొన్నట్టుగా అధికారులు ప్రకటించారు.

హైద్రాబాద్ నుండి బస్సు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకొంది. వేగంగా  బస్సు బోల్తా కొట్టడంతో మంటలు వ్యాపించినట్టుగా పోలీసులు తెలిపారు. మంటలు డీజీల్ ట్యాంకు కు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.