Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్‌నకు షాక్: విషంతో కూడిన పార్శిల్, దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు  గుర్తు తెలియని వ్యక్తులు విషం కూడిన పార్శిల్ ను పంపారు.ఈ పార్శిల్ ను తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన సెక్యూరిటీ అధికారులు అక్కడే నిలిపివేశారు. ఈ విషయమై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Parcel with ricin poison 'mailed to Donald Trump and blocked by police'
Author
USA, First Published Sep 20, 2020, 10:29 AM IST

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు  గుర్తు తెలియని వ్యక్తులు విషం కూడిన పార్శిల్ ను పంపారు.ఈ పార్శిల్ ను తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన సెక్యూరిటీ అధికారులు అక్కడే నిలిపివేశారు. ఈ విషయమై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్రంప్ పేరుతో వచ్చిన పార్శిల్ ను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. రిసిన్ అనే విష పదార్ధం ఈ పార్శిల్ లో ఉందని దర్యాప్తు అధికారులు తేల్చారు. 

ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పోస్ట్ ఇన్స్‌పెక్షన్ సర్వీస్ కలిపి సంయుక్తంగా ఈ విషయమై విచారణ జరుపుతున్నారు. 2018 లో మాజీ నేవీ అధికారి ఒకరు రిసిన్ కూడిన లేఖను ట్రంప్‌నకు పంపారు. ఈ విషయాన్ని పసిగట్టిని సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

2014 లో కూడ ఇదే తరహాలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు కూడ మిస్సిసిపీకి చెందిన ఓ అధికారి రిసిన్ రుద్దిన లేఖను పంపారు. దాన్ని అధికారులు ముందుగానే గుర్తించారు.

విషంతో కూడిన పార్శిల్ ను ఎవరు ట్రంప్‌నకు పంపారనే విషయమై సెక్యూరిటీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎన్నికల సమయంలో ఈ లేఖ ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది.గతంలో ఇదే తరహాలో అధ్యక్షులకు లేఖలు పంపినవారు శిక్షలకు గురయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios