ఇస్లామాబాద్:  మద్యం మత్తులో స్నేహితుల సమక్షంలో  తన భార్యను నగ్నంగా డ్యాన్స్ చేయాలని  ఓ భర్త భార్యను చిత్రహింసలు పెట్టాడు. తాను చెప్పినట్టుగా వినలేదని ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతేకాదు ఆమెకు గుండు కొట్టాడు. మరునాడు ఆమె ఇంటి నుండి తప్పించుకొని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పాకిస్థాన్‌లోని ఫైజల్ అనే వ్యక్తి   నాలుగు రోజుల క్రితం తన ఇద్దరు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు.  ఇంట్లోనే స్నేహితులతో కలిసి  ఆయన మందు పార్టీ చేసుకొన్నాడు.  మద్యం తాగిన ఫైజల్ తన భార్యను విపరీతమైన కోరిక కోరాడు. మద్యం తాగాలని భార్యను బలవంతపెట్టాడు. ఆమె అంగీకరించలేదు.

ఆ తర్వాత ఆయన నగ్నంగా డ్యాన్స్ చేయాలని భార్యపై ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించలేదు. దీంతో ఫైజల్ కోపంతో ఊగిపోయాడు.  భార్య బట్టలను విప్పేశాడు. తన స్నేహితుల ముందే ఆమెను కట్టేశాడు. ట్రిమ్మర్ తీసుకొచ్చి ఆమెకు గుండు చేశాడు.

అంతేకాదు తాను చెప్పినట్టుగా డ్యాన్స్ చేయాలని ఆమెను ఐరన్ రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు.  అంతేకాదు నగ్నంగానే ఆమెను ఉరితీస్తానని హెచ్చరించాడు. మరునాడు ఆమె ఇంట్లో నండి తప్పించుకొని పారిపోయింది. 

పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయలేదు. అంతేకాదు బాధితురాలిని డబ్బులు డిమాండ్ చేశారు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన మానవహక్కుల మంత్రి దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన బాధితురాలికి ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలి భర్త, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.