ఢిల్లీ: భారత్ పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను పాకిస్థాన్ నిలిపివేసింది. పాక్ భూభాగంలోని లాహోర్ లో ఈ రైలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 

ఉదయం 8గంటలకు లాహోర్ నుంచి ట్రైన్ ఢిల్లీకి బయలు దేరాల్సి ఉండగా రాకపోవడంతో ట్రైన్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుంచి అటారీల మధ్య నడుస్తోంది. వారానికి రెండు రోజులు మాత్రమే నడుస్తోంది. 

బుధవారం, ఆదివారం ఢిల్లీ నుంచి బయలు దేరి పాకిస్థాన్ కు చేరుకుంటుంది. అయితే బుధవారం ఉదయం 8గంటలకు బయలుదేరాల్సి ఉండగా బయలు దేరకపోవడంతో ట్రైన్ నిలిపివేసినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీంతో లాహోర్ లోనే ప్యాసింజర్లు నిలిచిపోయారు. 

1971లో భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. 1976 జూలై 22 నుంచి సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఇరుదేశాల మధ్య రాకపోకలు సాగిస్తోంది.