Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య కారుపై ఆగంతకుల కాల్పులు...

 

తన మాజీ భర్తను లక్ష్యంగా చేసుకుని  రెహమ్ ఖాన్ విమర్శలు గుప్పించారు. ‘నా మేనల్లుడి వివాహం నుంచి తిరిగి వస్తుండగా కాల్పులు జరిగాయి. మోటార్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినప్పుడు కారులో నా వ్యక్తిగత వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు’ అని రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు.

Pakistan Prime Minister Imran Khan's ex-wife Reham Khan car fired by bystanders
Author
Hyderabad, First Published Jan 3, 2022, 11:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్ ప్రధానమంత్రి Imran Khan మాజీ భార్య Reham Khan కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి తాను ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని.. Pakistan ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్  పిరికిపందలు, దుండగులు,  అత్యాశ పరుల దేశంగా మారిందని ఆమె పేర్కొన్నారు.

తన మాజీ భర్తను లక్ష్యంగా చేసుకుని  రెహమ్ ఖాన్ విమర్శలు గుప్పించారు. ‘నా మేనల్లుడి వివాహం నుంచి తిరిగి వస్తుండగా కాల్పులు జరిగాయి. మోటార్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినప్పుడు కారులో నా వ్యక్తిగత వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు’ అని రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు.

కాల్పుల ఘటన తనకు ఆందోళన కలిగించిందని ఆమె చెప్పారు.  బ్రిటిష్-పాకిస్తానీ  మూలాలకు చెందిన  జర్నలిస్ట్,  మాజీ టీవీ యాంకర్ అయిన రెహమ్ ఖాన్  ఇమ్రాన్ ఖాన్ 2014లో వివాహం చేసుకున్నారు అప్పటినుంచి 2015 అక్టోబర్ 30వ తేదీ వరకు కాపురం చేసి  ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ నుంచి విడిపోయారు.

48 రెహమ్ ఖాన్ మాజీ తన భర్త పై విమర్శకురాలిగా ప్రసిద్ధిచెందారు. తరచూ ఇమ్రాన్ ఖాన్ ను ఆమె దూషిస్తుంటారు. 2019లో పుల్వామా దాడి తర్వాత ఇమ్రాన్ఖాన్ దేశ సైన్యం చేతిలో కీలుబొమ్మ అని,  భావజాలం, మితవాద విధానంపై ఆయన అధికారంలోకి వచ్చారని రెహమ్ ఖాన్ ఆరోపించారు.

LOC: అక్రమంగా చొరబడుతుండగా మీ జవాన్‌ను చంపేశాం.. డెడ్ బాడీ తీసుకెళ్లండి: పాకిస్తాన్‌తో భారత ఆర్మీ

ఇదిలా ఉండగా, Pakistanలో New Year Celebrationsల్లో అపశృతి చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సంబురాల్లో కొందరు జరిపిన ఫైరింగ్‌ మరికొందరి ఇంటిలో విషాదాన్ని నింపింది. చెల్లచెదురుగా జరిపిన ఫైరింగ్‌లో ఓ బుల్లెట్ తాకి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో 18 మంది తీవ్ర గాయాల పాలైనట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి కరాచీలోని అజ్మేర్ నగ్రికి చెందిన మహమ్మద్ రజా అనే పిల్లాడు ఈ బుల్లెట్‌తో గాయపడ్డాడు. 

వెంటనే ఆయనను కరాచీలోని జిన్నా హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. కాగా, మరో 18 మంది కూడా ఈ బుల్లెట్లగాయాలతో హాస్పిటల్‌లో చేరినట్టు అధికారులు వివరించారు. 21 ఏళ్ల మనిషికి ఈ బుల్లెట్‌లతో వీపులో గాయమైంది. ఆయనను ఓ హాస్పిటల్ తీసుకెళ్లగా సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డట్టు అధికారులు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో ఫైరింగ్ జరపవద్దని ముందుగానే పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఫైరింగ్ చేస్తే హత్యా నేరం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పాకిస్తాన్‌లో ఫైరింగ్ చేశారు. గతేడాది కంటే ఈ సారే ఎక్కువ మంది ఈ కాల్పులతో గాయపడ్డారు. గతేడాది కేవలం నలుగురు మాత్రమే ఇలాంటి కాల్పులతో గాయపడ్డారు. 

కాగా, ఈ ఘటనను పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. వేడుకల సమయాల్లో ఏరియల్ ఫైరింగ్‌ను సంపూర్ణంగా నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందించారు. ‘ర్యాంబో’ తరహా యువకులు అలాంటి పిచ్చి పనులకు దూరంగా ఉండాలని సూచించారు. వాటికి బదులు నాగరికులుగా మెదులుకోవాలని ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios