పాకిస్తాన్‌లో పలువురు పోలీసు అధికారుల బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియడం లేదు. దీంతో పోలీసుల ఖాతాలను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. వీటిపై దర్యాప్తు మొదలైంది. 

న్యూఢిల్లీ: చొక్కా జేబుల్లోనో.. ప్యాంట్ పాకెట్లలోనో.. హ్యాండ్ బ్యాగుల్లోనో మనం మరిచిపోయిన 50 రూపాయలో.. 100 రూపాయలో దొరకితే కొన్ని క్షణాలపాటు తబ్బుబ్బిపోతాం. అలాంటి.. నెల జీతం కోసం తరుచూ బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకున్న వారి అకౌంట్‌లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. వారి సంతోషానికి అవధులు ఉంటాయా? ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లో కొందరు పోలీసుల అకౌంట్‌లలో కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అంత మొత్తంలో పడుతాయని వారికీ తెలియదు. బ్యాంకు అధికారి ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి మీ ఖాతాలో 10 కోట్లు జమ అయ్యాయని చెబితే.. ఖంగుతినడం ఆ పోలీసు అధికారి వంతు అయింది.

పాకిస్తాన్‌లో కరాచీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆమిర్ గోపాంగ్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆయన శాలరీతోపాటు ఆయన బ్యాంకు ఖాలో 10 కోట్లు వచ్చి పడ్డాయి. అవి ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో తెలియదు. గుర్తు తెలియన సోర్స్ నుంచి ఈ డబ్బు తన అకౌంట్‌లో పడింది.

‘నా అకౌంట్‌లో వేల రూపాయలకు మించి డబ్బులు ఎప్పుడూ ఉండేవి కావు. అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసి నాకు కళ్లు తిరిగినంత పనైంది’ అని గోపాంగ్ తెలిపాడు. బ్యాంకు నుంచి తనకు ఫోన్ వచ్చి చెప్పారని, వారి చెబితేనే తన అకౌంట్‌లో ఇంత మొత్తంలో డబ్బు పడినట్టు తెలిసిందని అన్నాడు. తన ఖాతాలో రూ. 10 కోట్లు డిపాజిట్ అయ్యాయని చెప్పినట్టు వివరించాడు.

Also Read: SBI 67వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్క అకౌంట్లో రూ.6000 జమ చేస్తామని మెసేజ్ వచ్చిందా..అయితే జాగ్రత్త..

కానీ, తాను ఏమీ చేయకుండా ముందుగానే తన బ్యాంక్ ఖాతాను నిలిపేసినట్టు చెప్పాడు. తన అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి ఏటీఎంను బ్లాక్ చేశారని తెలిపాడు. ఇదే విధంగా మరికొందరు పోలీసుల ఖాతాల్లోనూ డబ్బులు పడ్డాయి. వీటిపై దర్యాప్తు మొదలైంది.

పాకిస్తాన్‌లోని లర్కానా, సుక్కూర్‌లోనూ పోలీసుల ఖాతాల్లో ఐదు కోట్ల రూపాయల చొప్పున డబ్బులు పడ్డాయి.

లర్కానాలో ముగ్గురు పోలీసుల బ్యాంకు ఖాతాల్లో రూ. 5 కోట్ల చొప్పున పడ్డాయి. సుక్కూర్ పోలీసు అధికారి బ్యాంకులోనూ ఈ మొత్తంలో డబ్బులు పడ్డాయి.