సైనిక శిక్షణ విమానం కూలి దాదాపు 17మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందతి. ఈ ఘటనలో పైలెట్లు సహా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12మంది సాధారణ పౌరులు ఉన్నారు.

మరో 12మంది తీవ్రంగా గాయపడగా,... వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

శిక్షణలో భాగంగా టేకాఫ్ అయిన విమానం గాలిలో చక్కర్లు కొడుతుండగా... ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. దీంతో.. అదుపుతప్పి రావల్పిండి నగర శివారులోని ఇళ్ల మధ్యలో కుప్పకూలింది. ప్రమాదానికి ముందు కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయని,.. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదని అధికారులు చెబుతున్నారు.

నివాస సముదాయాల్లో కూలం కారణంగానే... సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయని... సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.