Asianet News TeluguAsianet News Telugu

అల్లం- వెల్లుల్లి కాన్ఫ్యూజన్.. పప్పులో కాలేసిన పాక్ మంత్రి.. ట్విట్టర్ లో ట్రోల్స్..!

పాకిస్తాన్ మంత్రికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అల్లం- వెల్లులి మధ్య ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు.  ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో... ఆయనను ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Pakistan minister says garlic is adrak and Twitter roasts Him
Author
Hyderabad, First Published Nov 25, 2021, 9:35 AM IST

కామన్ గా ఉండే.. రెండు పేర్లలో కన్ఫ్యూజ్ అవ్వడం చాలా కామన్ విషయం. మనలో చాలా మంది ఒకరి పేరు బదులు.. మరొకరి పేరు పిలుస్తూ ఉంటారు. అయితే.. మనం రెగ్యూలర్ గా రోజూ ఉపయోగించే వాటిలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతే... దానికి ఇతరులు పసిగడితే.. మన తలకొట్టేసినట్లే అయిపోతుంది. ఇక.. అలా పొరపాటు పడిన వ్యక్తి.. బాధ్యతయుతమైన పొజిషన్ లో ఉంటే.. ఆయనను ట్రోల్ చేసేవారు మరింత ఎక్కువ మంది ఉంటారు. పాకిస్తాన్ మంత్రికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అల్లం- వెల్లులి మధ్య ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు.  ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో... ఆయనను ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

 

బాధ్యతాయుతమైన పాక్ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లుల్లి, అల్లం మధ్య వ్యత్యాసాన్ని అర్ధం చేసుకోలేక పోవడంపై నెటిజన్లు నవ్వుతున్నారు.ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తినదగిన వస్తువుల ధరల గురించి మంత్రి ఫవాద్ చౌదరి ఒక సమావేశంలో మాట్లాడుతున్నారు. కానీ అతను వెల్లుల్లి యొక్క ఉర్దూ అనువాదాన్ని సరిగ్గా చేయలేకపోయాడు. వెల్లుల్లిని ‘అద్రాక్’ అంటూ గందరగోళ పరిచాడు. ఉర్దూలో వెల్లుల్లిని లెహ్సన్ అంటారు. 

Also Read: తొమ్మిదేళ్ల బాలికపై 1959లో హత్యాచారం.. 62యేళ్ల తరువాత డీఎన్ఏ టెస్టుతో తీర్పు.. కాకపోతే..

కాని మంత్రి ఫవాద్ చౌదరి మాత్రం అద్రాక్ అంటూ అల్లం గురించి చెప్పాడు.వెల్లుల్లికి ఉర్దూ పదం తెలియని మంత్రిని ట్విట్టరులో నెటిజన్లు ఘాటుగానే విమర్శించారు.వెల్లుల్లి అద్రాక్ మంత్రి చౌదరి రోజుకో కొత్త విషయం నేర్చుకోవాలి అంటూ నైలా ఇనాయత్ అనే నెటిజన్ కామెంట్ చేశారు. మంత్రివర్యులు బాల్యంలో ఏ స్కూలులో చదువుకున్నారు? అని డాక్టర్ వినాయక్ దూబే ప్రశ్నించారు.‘‘వెల్లుల్లి అల్లం వ్యాఖ్యలతో మంత్రి ఫవాద్ చౌదరి తికమక పడ్డాడని, నేను ఉక్రెయిన్ నుండి ఎంబీబీఎస్, బీటెక్ డ్యూయల్ డిగ్రీని పొందాను, నేను పాకిస్థాన్‌లో మంత్రి పదవికి దరఖాస్తు చేయవచ్చా?’’ అని అనిల్ కృష్ణ చంద్ర ట్వీట్‌లో ప్రశ్నించారు.మొత్తం మీద పాక్ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios