Asianet News TeluguAsianet News Telugu

కత్తెరతో కాదు.. షాప్ ఓపెనింగ్ రిబ్బర్‌ను పంటితో కత్తిరించారు! ఆ మంత్రి వీడియో వైరల్

ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లిన పాకిస్తాన్ మంత్రి ఫయ్యాజ్ ఉల్ హాసన్ చోహన్ రిబ్బన్ కటింగ్‌ను కత్తెరతో కాకుండా నోటితో చేశారు. కత్తెర పదును లేకపోవడంతో ఆయన పంటితో రిబ్బన్ కట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

pakistan minister cut opening ribbon with teeth instead of scissor and video surfaces in social media
Author
New Delhi, First Published Sep 3, 2021, 3:25 PM IST

న్యూఢిల్లీ: ప్రారంభ కార్యక్రమాలకు, షాప్ ఓపెనింగ్‌లకు ప్రముఖులను పిలిచి రిబ్బన్ కటింగ్ చేయించడం సాధారణమైన విషయం. షాపింగ్ మాల్స్‌కు, వ్యాపార సముదాయాల ఓపెనింగ్‌లకు సెలెబ్రిటీలు లేదా రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి హల్‌చల్ చేయిస్తారు. రిబ్బన్ కట్ చేయించి కొత్త షాప్‌లోకి వారు ఎంట్రీ ఇస్తారు. సాధారణంగా ఓపెనింగ్ ఫంక్షన్స్ ఇలాగే జరుగుతాయి. కానీ, పాకిస్తాన్‌ మంత్రి ఇందుకు భిన్నంగా ట్రెండ్ సెట్ చేసి సోషల్ మీడియాలో సంచలనానికి తెరతీశారు. రిబ్బన్  కటింగ్‌కు ఇచ్చిన కత్తెర దాన్ని కత్తిరించకపోవడంతో బిత్తరపోయి చుట్టూ చూశారు. నవ్వులు పూస్తుండగా తప్పదని కత్తెర పక్కనబెట్టి పంటితో రిబ్బన్ కట్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నది.

 

పాకిస్తాన్ జైళ్ల శాఖ మంత్రి, పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫయ్యాజ్ ఉల్ హాసన్ చోహన్ ఈ ట్రెండింగ్ స్టోరీకి లీడ్ రోల్. తన సొంత నియోజకవర్గం రావల్పిండిలో ఎలక్ట్రానిక్ షాప్ ఓపెనింగ్ కోసం మంత్రి ఫయ్యాజ్‌ను షాప్ యజమాని ఆహ్వానించారు. ముస్తాబై ఆ షాప్ ఓపెనింగ్ సెరెమనీకి వెళ్లారు. ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేయాల్సిందిగా ప్లేట్‌లో కత్తెర అందించారు. దాన్ని అంతే హుందాగా తీసుకుని రిబ్బన్ కట్ చేసే ప్రయత్నం చేశారు. కట్ కాలేదు. నవ్వుతూ చుట్టూ చూశారు. చుట్టూ ఉన్న జనమూ నవ్వుతూ కనిపించారు. మరోసారి కట్ చేసే ప్రయత్నం చేశారు. మళ్లీ అదే పరిస్థితి. రిబ్బన్ కట్ కాలేదు. ఇప్పుడు నవ్వులు మరింత ఎక్కువగా వినిపించాయి. ఒకింత విస్మయంగా చుట్టూ చూస్తు పంటితో కొంచెం కట్ చేసి మళ్లీ కత్తెర చేతపట్టాడు. అయినా అదే పరిస్థితి. ఇక లాభం లేదని కత్తెర ప్లేట్‌లో ఉంచి రిబ్బన్ మొత్తాన్ని నోటితోనే కత్తిరించేశారు. ఇంతే అంటూ ఫోజు ఇచ్చి షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆయనే స్వయంగా ఆ వీడియోను ట్వీట్ చేశారు.

 

ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నది. నెటిజన్లు ఆయన చర్యలపై తోచిన స్టైల్‌లో కామెంట్ చేశారు. కొందరు మంత్రి స్టైల్‌ను మెచ్చుకోగా, ఇంకొందరు ట్రోల్ చేశారు. డాబర్ లాల్ దంత్ మంజన్ మహిమ అంటూ ఓ ట్విట్టర్ ఖాతాదారుడు స్పందించారు. ఇంకొకరు ఆయన పంటితో కాదు, బహుశా నాలుకతో కట్ చేసి ఉంటారని పేర్కొన్నారు. ఎందుకంటే కత్తెర కంటే కూడా ఆయన నాలుక పదునైనదని చురకలంటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios