తమ వైమానిక సిబ్బందిపై తాలిబాన్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తూ తమ సేవల్లో వారు హద్దుమీరి జోక్యం చేసుకుంటున్నదని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అందుకే కాబూల్‌కు విమాన సేవలను నిలిపేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. 

ఇస్లామాబాద్: బుద్ది గడ్డి తిన్నదన్న చందంగా విషజీవి అని తెలిసినా సర్పాన్ని పెంచితే ఏదో ఒక రోజు అది కాటేయకపోదు. Pakistan ఇదే పనిచేసింది. విషపురుగు అని తెలిసినా Talibanలకు మొదటి నుంచీ మద్దతునిచ్చింది. వారికి పరోక్షంగా బలాన్నిచ్చింది. చివరికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూలిపోయాక ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వానికి సహకరించాలని, ఆర్థిక మద్దతు ఇవ్వాలని, వారికో అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ వేదికలపైనా పాకిస్తాన్ గొంతు చించుకుంది. కానీ, ఇప్పుడేమైందంటే.. పాకిస్తాన్ అధికారులనే తాలిబాన్లు బెదిరించారు. వారి తలపై గన్ పాయింట్ పెట్టి గంటలతరబడి నరకాన్ని చూపించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పాకిస్తాన్ ఎంబసీ వచ్చి జోక్యం చేసుకునే వరకూ తుపాకీ గొట్టాన్ని చూస్తూనే ఆ అధికారులు ఉండిపోయారు. దీనికి తోడు ఇతర విషయాల్లోనూ తాలిబాన్ అధికంగా జోక్యం చేసుకుంటున్నదని పాకిస్తాన్ పేర్కొంటూ ఆ దేశానికి విమాన సేవలను నిలిపేసింది. 

తాలిబాన్లు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, తమ flight servicesలో తరుచూ కలుగజేసుకుంటున్నారని, ఇష్టారీతిన నిబంధనలు మారుస్తూ ఒత్తిడి చేస్తున్నారని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ airlines పేర్కొంది. ఈ కారణంగానే ఆ దేశానికి విమాన సేవలను నిలిపేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. విదేశీ వైమానిక సేవలను ఆఫ్ఘనిస్తాన్‌కు అందిస్తున్న ఏకైక దేశం పాకిస్తానే.

తాలిబాన్లు విజయం సాధించిన తర్వాత విదేశీయులు, ఇంకొందరు ఆఫ్ఘనిస్తాన్లు దేశం దాటిన తర్వాత గతనెల Afghanistanలో ఎయిర్‌పోర్టు మళ్లీ తెరుచుకుంది. ఇక్కడికి పాకిస్తాన్ విమానాలు వెళ్తున్నాయి. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ వైమానిక సంస్థ క్యామ్ ఎయిర్ కూడా సేవలను అందిస్తున్నది. 

Also Read: అంతర్జాతీయ సమావేశానికి తాలిబాన్లకు రష్యా ఆహ్వానం.. సరిహద్దు భద్రతపై పుతిన్ ఆందోళన?

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విమాన సేవల ధరలు చుక్కలనంటాయని తాలిబాన్లు పేర్కొన్నారు. తమ విజయానికంటే ముందున్న ధరల స్థాయికి ప్రస్తుత ధరలను అమలు చేయాలని ఆదేశించారు. గతంలో కాబూల్ నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు 120 నుంచి 150 అమెరికా డాలర్లను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ టికెట్ ధర తీసుకునేది. కానీ, ప్రస్తుతం ఈ టికెట్ ధర 2500 అమెరికన్ డాలర్లకు చేరింది.

ఈ నేపథ్యంలోనే గత ధరల స్థాయిలోనే టికెట్లు అందించాలని తాలిబాన్ రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది. లేదంటే విమానాలను నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, ఈ నిబంధనలు ఉల్లంఘనలు జరిగితే తమకు తెలియజేయాలని వివరించింది.

పాకిస్తాన్ కూడా కాబూల్‌కు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్స్‌ను నడపడం లేదు. చార్టర్ ఫ్లైట్స్‌నే నడుపుతున్నది. వైమానిక సంస్థలు కాబూల్‌ను ఇంకా వార్‌జోన్‌గానే పరిగణిస్తున్నాయని, కాబట్టి అక్కడికి విమానాలు వెళ్లడం క్లిష్టతరమైందని పాకిస్తాన్ తెలిపింది. ప్రత్యేకంగా ఒక్కో ఫ్లైట్ నాలుగు లక్షల అమెరికన్ డాలర్ల ఇన్సూరెన్స్ ప్రీమియమ్ స్వంతంగా హామీపడిందని వివరించింది.

Also Read: ఆ ముస్లిం యోధుడు.. సోమనాథ్ ఆలయ విగ్రహాలను ధ్వంసం చేశాడు.. తాలిబాన్ నేత ట్వీట్.. ఇండియన్స్ ఫైర్

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాబూల్‌లోని తమ సిబ్బంది చివరి నిమిషం వరకూ విమాన సేవల అనుమతి కోసం తీవ్ర ఒత్తిడి, నిబంధనల మార్పులను ఎదుర్కోవలసి వచ్చిందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. తీవ్ర బెదిరింపుల ధోరణిని తాలిబాన్లు అవలంబించారని వివరించింది.

ఒకసారైతే తమ దేశ ప్రతినిధిపై నాలుగు గంటలపాటు గన్ పాయింట్ పెట్టే ఉంచారని తెలిపింది. చివరికి కాబూల్‌లోని పాకిస్తాన్ ఎంబసీ అధికారులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారని వివరించింది.