Asianet News TeluguAsianet News Telugu

సింధ్ ప్రావిన్స్‌లో హిందూ మహిళ హత్య.. తలను తెగ నరికిన దుండగులు.. మైనార్టీల భద్రతపై   భారత్ ఆందోళన

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ మహిళ దయా భిల్ (40 ఏళ్లు) హత్యకు గురై ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ మహిళ దయా భీల్‌ను హత్య అనంతరం.. పాకిస్థాన్ తన మైనారిటీలను రక్షించాలని భారత్ పిలుపునిచ్చింది.

Pak Hindu Woman Killed, Skin Reportedly Peeled Off; India Responds
Author
First Published Dec 30, 2022, 5:36 AM IST

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది.  తల నరికి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ ఘటన సెంట్రల్ సింధ్‌లోని సంఘర్ జిల్లాలోని సింజోరో ప్రాంతంలో చోటుచేసుకుంది. సింజోరో కరాచీ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. 40 ఏళ్ల దయా భిల్ వితంతు మహిళ తన కుమారుడితో కలిసి ఉంటూ.. వ్యవసాయం చేసుకునేది. మహిళకు ఎవరితోనూ శత్రుత్వం లేదని ఆమె బంధువులు తెలిపారు.

ఇదిలాఉంటే.. ఈ హత్యపై భారత్ స్పందించింది. మైనారిటీల పట్ల తన బాధ్యతను నెరవేర్చాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పాకిస్థాన్‌ను కోరారు.ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "హిందూ మహిళ దయా భీల్‌ను హత్య నివేదికలను చూశాము.కానీ, ఈ కేసులో మాకు నిర్దిష్ట వివరాలు లభించలేదు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన మైనారిటీలను రక్షించాలని పునరుద్ఘాటిస్తున్నాం. వారి భద్రత, శ్రేయస్సు కల్పించాల్సిన బాధ్యత మీదే" అని అన్నారు.

హిందూ మహిళ దయా భీల్ దారుణ హత్యకు గురికావడంతో పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో.. థార్‌పార్కర్ సింధ్‌లోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ కృష్ణ కుమారి ఘటన స్థలానికి చేరుకుంది.  హిందూ మహిళ దారుణ హత్య వార్తను ధృవీకరించారు. ఆ ట్వీట్ చేస్తూ.. "దయా భీల్ అనే 40 ఏళ్ల వితంతువు దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆమె మృతదేహం చాలా దారుణమైన స్థితిలో కనుగొనబడింది. ఆమె తల శరీరం నుండి వేరు చేయబడింది. క్రూరులు మొత్తం తల నుండి మాంసాన్ని తొలగించారు. ఘటన స్థలానికి పోలీసు బృందాల సహాయంతో చేరుకున్నా" అని పేర్కొంది.  

ఈ ఘటనపై స్థానిక మీడియా సంస్థ ది రైజ్ న్యూస్ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రస్తవించింది. "కిరాతకంగా హత్య చేయబడిన దయా భీల్ కేసును మీడియాలో హైలైట్ చేయరు. ఇస్లామాబాద్‌లోని రాజకీయ నాయకులు లేదా సింధ్ ప్రభుత్వం ప్రకటన చేయరు. పోలీసులు నిందితులను పట్టుకుంటారా? హిందువులను వారి మాతృభూమిలో సమాన పౌరులుగా చూస్తారా? లేదా? అని ప్రశ్నించింది.   

అలాగే.. పాకిస్తానీ వార్తాపత్రిక డాన్ ప్రకారం.. మియాన్ మిథు అని ప్రసిద్ది చెందిన పిర్ ఎగువ సింధ్‌లో మైనర్ హిందూ బాలికను బలవంతంగా మతమార్పిడి  చేసి.. వివాహం చేసుకున్నట్టు అభియోగాలు ఉన్నాయి. దీంతో అతడు అపఖ్యాతి పాలయ్యాడు. దేశంలోని మహిళలు, మైనారిటీలు, పిల్లలు , మీడియా వ్యక్తుల భయంకరమైన పరిస్థితిని ప్రతిబింబించే అనేక మీడియా నివేదికలు, గ్లోబల్ బాడీలతో పాకిస్తాన్‌లో మానవ హక్కులు కొత్త స్థాయికి చేరుకున్నాయని కార్యకర్తలు అంటున్నారు. సింధ్‌లో.. బలవంతపు మతమార్పిడులు, మైనారిటీ వర్గాలపై దాడులు మరింత ఎక్కువయ్యాయి. మైనర్ హిందూ, సిక్కు , క్రిస్టియన్ బాలికలను బలవంతంగా మతమార్పిడి చేయడం, ఎల్లప్పుడూ ఒత్తిడికి లోబడి ఉండటం, దేశంలో పెరుగుతున్న సాధారణ దృగ్విషయంగా మారింది.

నవంబర్‌లో వరల్డ్ సింధీ కాంగ్రెస్ (WSC) లండన్‌లో సింధ్‌ పరిస్థితులపై 34వ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో  WSC చైర్‌పర్సన్ డాక్టర్ రుబీనా షేక్ మాట్లాడుతూ.. పలు దారుణాలను ప్రస్తావించారు. సింధ్ చరిత్రలో అత్యంత దారుణ కాలానికి సాక్ష్యమిస్తోందని నొక్కి చెప్పారు. సమావేశం సందర్భంగా.. సింధీ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ సంస్థలను స్థానిక , అంతర్జాతీయ న్యాయస్థానాలలో పాకిస్తాన్ ప్రభుత్వంపై "ఎకోసైడ్ కేసు" దాఖలు చేయాలని కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios