గుడ్‌న్యూస్: చింపాంజీలపై కరోనా టీకా సక్సెస్, మనుషులపై తుది దశలో ట్రయల్స్

కరోనా నివారణకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది. చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు మంచి పలితాలు ఇచ్చినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. మనుషులపై ఈ టీకా ప్రయోగాలను నిర్వహిస్తున్నట్టుగా ఆ సంస్థ తెలిపింది.

Oxford vaccine against Covid-19 in final stage of clinical trials


వాషింగ్టన్:కరోనా నివారణకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది. చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు మంచి పలితాలు ఇచ్చినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. మనుషులపై ఈ టీకా ప్రయోగాలను నిర్వహిస్తున్నట్టుగా ఆ సంస్థ తెలిపింది.

అన్నీ కూడ అనుకొన్నట్టుగా విజయవంతమైతే  ఈ ఏడాది అక్టోబర్ మాసానికి ఈ టీకాను మార్కెట్లోకి విడుదల చేయాలని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ భావిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తయారీకి నాయకత్వం వహిస్తున్న జెనెన్‌ర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌ ఆడ్రియన్‌ హిల్‌ ప్రకటించారు. 

ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్‌లోని కొంతమంది కార్యకర్తలపై ప్రయోగించారు. 
 టీకా అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 సంస్థలు,పరిశోధన కేంద్రాలు టీకాలు తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించాయి.  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ టీకా మేలైన ఫలితాలు ఇస్తు న్నట్లు తెలుస్తోంది.

మనుషులపై ఈ టీకా ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. దక్షిణాఫ్రికాలోనూ ఈ టీకాను సుమారు 200 మందిపై ప్రయోగిస్తున్నారు. బ్రిటన్‌లో సుమారు 4000 మంది ఇప్పటికే టీకా ప్రయోగాలకు తమ సమ్మతిని తెలిపారు.

 మరో పదివేల మందిని సమీప భవిష్యత్తులో నియమించుకుంటామని కంపెనీ చెబుతోంది. ఏప్రిల్‌ 23న ఈ మానవ ప్రయోగాలు మొదలయ్యాయని సమాచారం..
అక్టోబరులో టీకాను విడుదల చేస్తామని అడ్రియన్‌ హిల్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఆస్ట్రా జెనెకా 3కోట్ల టీకా డోసులను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ టీకాను స్థానికంగా తయారు చేసేందుకు ఆస్ట్రా జెనెకాతో ఒక ఒప్పందం చేసుకుంటున్నట్లు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్యురాడో పాజిల్లో తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios