న్యూఢిల్లీ : అల్ ఖైదా అగ్ర నాయకుడు ఒసామాబిన్ లాడెన్ తనయుడు హంజాబిన్ లాడెన్ ను హతమార్చినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఎక్కడ హతమార్చారు అనేది పూర్తిగా స్పష్టం చేయలేదు. 

ఇకపోతే ఒసామాబిన్ లాడెన్ ను అమెరికా నావికా దళం పాకిస్థాన్ లోని అబోత్తాబాద్ రహస్య స్థావరంలో ఉండగా మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒసామా బిన్ లాడెన్ తనయడు హంజాబిన్ లాడెన్ తప్పించుకున్నాడు.

ఒసామా బిన్ లాడెన్ హతం అనంతరం ఆయన వారసత్వంగా అల్ ఖైదా చీఫ్‌గా హంజాబిన్ లాడెన్ వ్యవహరించాడు. హంజాబిన్ అల్ ఖైదా కార్యకలాపాల్లో హంజాబిలాడెన్ కీలక వ్యక్తిగా మారారు. 

అనంతరం అమెరికాకు సైతం పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో అగ్ర రాజ్యం హంజాబిన్ లాడెన్ పై కన్నెర్రజేసింది. హంజాబిన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.  హంజాబిన్ లాడెన్ పై భారీ రివార్డు ప్రకటించింది. 

హంజాబిన్ లాడెన్ ను పట్టించిన వారికి భారీ రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. సుమారు మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఇకపోతే గత ఏడాది హంజాబిన్ లాడెన్ సౌదీఅరేబియాను బెదిరిస్తూ వీడియో విడుదల చేశాడు. 

అంతేకాదు హంజాబిన్ లాడెన్ కు సంబంధించిన ఆస్తులను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింప జేసింది. ఆ నాటి నుంచి హంజాబిన్ కోసం అమెరికా వేటాడుతూనే ఉంది. 

ఎట్టకేలకు హాంజాబిన్ లాడెన్ ను హతమార్చినట్లు అమెరికా స్పష్టం చేసింది. హంజాబిన్ ను హతమార్చామని ముగ్గురు అమెరికా అధికారులు ధృవీకరించారు. ఇకపోతే అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ కు ముగ్గురు భార్యలు. వారు పాకిస్థాన్ లోని అబోత్తాబాద్ లో నివాసం ఉండేవారు. 

అబోత్తబాద్ లో ఒసామా బిన్ లాడెన్ తలదాచుకోగా 2011లో అమెరికా నావికాదళం అక్కడకు వెళ్లింది. ఒసామాబిన్ లాడెన్ ను పట్టుకుని హతమార్చింది. అప్పట్లో ఆ దాడి నుంచి హంజాబిన్ లాడెన్ తప్పించుకున్న సంగతి తెలిసిందే.