శ్రీలంక రాజధాని కొలంబోలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటికే వరస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రజలు వణికిపోతున్నారు. కాగా.. మరో పేలుడు సంభవించింది. ఈ సారి ఉగ్రవాదులు సినిమా థియేటర్‌ను టార్గెట్ చేసుకున్నారు. మోటర్ బైక్‌లో పేలుడు పదార్థాలు పెట్టి... పేలుడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.

 శ్రీలంకలో ఈస్టర్‌ పర్వదినం రోజున జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 360 దాటినట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. 500మందికిపైగా గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి 60 మందికి పైగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.