Asianet News TeluguAsianet News Telugu

వేలంలో స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు.. ఎంత పలుకుతున్నాయంటే...

ప్రముఖులు వాడిన వస్తువులు వేలానికి రావడం మామూలే. అలా ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వాడిన పాత చెప్పులు వేలానికి వచ్చాయి. 

Old Worn-Out Sandals of Steve Jobs..Go Up For Auction
Author
First Published Nov 12, 2022, 12:49 PM IST

ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వాడిన బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా చెప్పులు వేలానికి వచ్చాయి. ఈ వేలం నిర్వాహకుడు, జూలియన్స్ ఆక్షన్స్ ప్రకారం వీటి ధర 60,000 డాలర్ల నుండి 80,000 డాలర్ల అంటే రూ. 48,32,889నుంచి రూ. 62,43,43,855 వరకు పలకొచ్చని  అంచనా. 

వేలంలో చెప్పులతోపాటు, చెప్పుల NFT ఫోటోతో పాటు ఫోటోగ్రాఫర్ జీన్ పిగోజీ పుస్తకం కూడా ఉంది. ఈ పుస్తకానికి "ది 213 మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ ఇన్ మై లైఫ్" అని పేరు పెట్టారు. స్టీవ్ జాబ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరు అన్న సంగతి తెలిసిందే. ఈ  వేలం నవంబర్ 11 న ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.. నవంబర్ 13న ఈ వేలం ముగుస్తుంది. ఈ ఆక్షన్ హౌస్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం, జాబ్స్ 1970 -1980లలో ఈ ప్రత్యేకమైన చెప్పులను ధరించారు. 

స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్ మార్క్ షెఫ్ దగ్గర ఈ చెప్పులు గతంలో ఉండేవి. వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యాపిల్ సహ వ్యవస్థాపకుడి మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్,  మాట్లాడుతూ.. స్టీవ్ జాబ్స్ వార్డ్‌రోబ్ లో చెప్పులు కూడా ఉండేవి. అవి ఆయన యూనిఫాంలో భాగం. యూనిఫాం ఎందుకంటున్నానంటే.. బట్టల మీద పెద్దగా దృష్టి పెట్టకపోయేవారు. యూనిఫాం పాటించడం వల్ల పొద్దున ఏ బట్టలు వేసుకోవాలనా అని.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన వార్డ్ రోబ్ లో ఈ చెప్పులు అత్యంత మామూలు విషయం’ అని ఆమె చెప్పింది.

మహిళ చేతిమీద మొలిచిన ముక్కు... దీనివెనుక పెద్ద కథే ఉంది.. అదేంటో తెలుసా??

అంతేకాదు.. ఆమె ఇంకా మాట్లాడుతూ... "అందరిలో ప్రత్యేకంగా ఉండడానికి అతను ఎప్పుడూ, ఏమీ చేయడు... ఏదీ ప్రత్యేకంగా కొనేవాడు కాదు. అతను చెప్పులు ఎంత కంఫర్ట్ గా ఉన్నాయో.. వాటి డిజైన్ ఎంత సింపుల్ గా ఉందో మాత్రమే చూసేవాడు. అక్కడ తాను వ్యాపారవేత్తలా ఆలోచించేవాడు కాదు. 

యాపిల్ చరిత్రలో అనేక కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను ధరించినట్లు వేలం సంస్థ పేర్కొంది. "1976లో, అతను ఆపిల్ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో ఆపిల్ కంప్యూటర్ ప్రారంభం  అప్పుడు కూడా ధరించాడు. జాబ్స్ బ్రికెన్ స్టాక్స్ ఎంత బాగున్నాయో చూశాక వాటికి అతను ఆకర్షితుడయ్యాడు" అని వారి వెబ్‌సైట్ పేర్కొంది.

2017లో ఇటలీలోని మిలన్‌లోని సలోన్ డెల్ మొబైల్, 2017లో జర్మనీలోని రహ్మ్స్‌లోని బిర్కెన్‌స్టాక్ హెడ్‌క్వార్టర్స్, న్యూయార్క్‌లోని సోహోలో కంపెనీ మొదటి U.S. సైట్, జర్మనీలోని కొలోన్‌లో IMM కోల్న్ ఫర్నిచర్ ఫెయిర్, 2018లో Die Zeit మ్యాగజైన్ కోసం Zeit ఈవెంట్ బెర్లిన్, ఇటీవల, జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోని హిస్టరీ మ్యూజియం వుర్టెంబర్గ్  వంటి అనేక ప్రదర్శనలలో ఈ చెప్పులు కనిపించాయి. 

జూలియన్స్ ఆక్షన్స్ వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం, బిడ్15,000 డాలర్లతో ప్రారంభమైంది.  ప్రస్తుతం 22,500 డాలర్ల రెండు బిడ్‌లు వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios