అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఓహియోలోని డేటన్‌లో ఉన్మాది  కాల్పుల్లో 10 మంది మరణించగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితుడిని కాల్పిచంపారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆదివారం ఉదయం టెక్సాస్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కొంతమంది దుండగులు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది మరణించగా.. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.