అమెరికా- ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల పరంపరపై ఉద్రిక్తత నెలకొంది.  U.S. ఒత్తిడి, ఆంక్షలకు దీటుగా ఉత్త‌ర కొరియా ప్యోంగ్యాంగ్ నుండి ఘాటుగా స్పందించింది.  "ఫైర్ అండ్ ఫ్యూరీ ఒప్పందాలను ప‌ట్ట‌న పెట్టిన‌ట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. 

ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో అల్లాడిపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఇవ్వ‌ని ప‌ట్ట‌నట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. వరుస క్షిపణి ప్రయోగాలతో అగ్ర దేశాల వెన్నులో వ‌ణుకు పుట్టించేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ యేడాదిలోనే ఆరు క్షిపణి ప‌రీక్ష‌ల‌ను నిర్వహించడం గమనార్హం. ఈ క్ర‌మంలో ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. 

ఉత్తర కొరియా... యునైటెడ్ స్టేట్స్‌కు దీటుగా త‌న రక్షణ వ్య‌వ‌స్థ‌ను బలపరుచుకోవడానికి ప్ర‌య‌త్నిస్తోంద‌నీ, ఈ క్రమంలో అణు ఒప్పందాల‌ను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని పరిశీలిస్తుందని KCNA మీడియా వెల్లడించింది. అణ్వాయుధాలను పరీక్షించడంపై స్వీయ నిబంధ‌న‌లను తాత్కాలిక నిషేధించిన‌ట్టు స్పష్టం చేసింది.

నిషేధం కొనసాగుతున్నా అణ్వాయుధ పరీక్షలను నిర్వహించడంతో అమెరికా ఇటీవలే మరిన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాము అగ్ర‌దేశ అధిప‌త్యానికి , బెదిరింపులకు లొంగిపోమని సంకేతాన్ని ఇచ్చేందుకే కిమ్ వరుస ప్రయోగాలు నిర్వహించినట్టు ప్ర‌పంచ‌దేశాలు భావిస్తోన్నాయి.

ఈ క్రమంలో ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అధ్య‌క్ష‌త‌న‌ బుధవారం త‌న‌ అధికార వర్కర్స్ పార్టీ తో పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ భేటీలో నూత‌న విధివిధానాల‌ను చర్చించన‌ట్టు , అలాగే.. అమెరికా విధానంపై కూడా చ‌ర్చిన‌ట్టు KCNA వార్తా సంస్థ తెలిపింది.

ఈ క్ర‌మంలో అణ్వ‌యుధా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని, తాత్కాలికంగా నిలివేయాల‌ని, అణు కార్యకలాపాలను పునఃప్రారంభించాల‌ని.. ఈ విష‌యాన్ని పరిశీలించాలని ఆదేశించింది. అదే సమయంలో తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని, సౌర్వభౌమాధికారం నిలుపుకోవాలని భావిస్తోంద‌ని అని KCNA తెలిపింది.

అణ్వాయుధ ప‌రీక్ష‌ల‌పై, అణు వార్‌హెడ్‌లు, దీర్ఘ-శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ICBM) పరీక్షించడంపై 2019 చివరిలో కిమ్ విధించిన‌ తాత్కాలిక నిషేధాన్ని ఇక నుంచి కట్టుబడి ఉండడ‌నీ, యునైటెడ్ స్టేట్స్ ఆంక్షాల‌ను అనుస‌రించ‌ద‌ని మీడియా తెలిపింది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై అసంతృప్తితో రగిలిపోతున్నద‌నీ, ఇరు దేశాల మ‌ధ్య సత్సంబంధాలు స‌రిగా లేవ‌ని, విరోధాలు ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్నాయ‌ని తెలిపాయి. ఈ భేటీలో యు.ఎస్. సామ్రాజ్యవాదులతో దీర్ఘకాలిక ఘర్షణకు దేశ‌ మరింత సంసిద్దంగా ఉండాల‌ని పొలిట్ బ్యూరో లో వివ‌రించింది. 

యునైటెడ్ స్టేట్స్, అనేక ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి.. ఉత్త‌ర‌ క్షిపణి పరీక్షలపై చర్చించడానికి కొన్ని గంటల ముందు ఉత్తర కొరియా హెచ్చరిక‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి.. తదుపరి ఆయుధ పరీక్షలను సమర్థించడానికి కిమ్ ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తారని తెలుస్తోంది.

గ‌తేడాది కిమ్ దివంగత తండ్రి, తాతయ్యల జ‌యంతులు సందర్భంగా ఉత్తర కొరియా అణు, క్షిపణులను పరీక్షించవచ్చని, 2017లో చూసిన కవ్వింపులు, ఆంక్షల యొక్క విష చక్ర పరిస్థితిలోకి తిరిగి వెళ్ళే అవకాశం ఉందని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కొరియన్ స్టడీస్‌లో ప్రొఫెసర్ యాంగ్ మూ-జిన్ పేర్కొన్న విష‌యం తెలిసిందే.

2017లో U.S. ప్రధాన భూభాగాన్ని ఢీకొట్టగల సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన తర్వాత, ఉత్తర కొరియా దౌత్యం సంబంధాలు ప్రారంభయ్యాయి. అప్పటి నుండి దాని ICBMలు లేదా అణ్వాయుధాలను పరీక్షించలేదు. కానీ 2019లో ఇరు దేశాల మ‌ధ్య నిర్వ‌హించిన శిఖరాగ్ర సమావేశం విఫ‌లమైన త‌రువాత‌.. అణు నిరాయుధీకరణ చర్చలు నిలిచిపోయి, తిరిగి ప్రతిష్టంభన నెల‌కొంది. దీంతో స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల (SRBMs) శ్రేణిని పరీక్షించడం ప్రారంభించింది.

ఈ త‌రుణంలో ప్యోంగ్యాంగ్ క్షిపణి ప్రయోగాలను ద‌క్షిణ కొరియా స‌మ‌ర్థించింది. త‌మ దేశ‌ స్వీయ-రక్షణ, సార్వభౌమ హక్కును కాపాడుకోవ‌డానికి చేసిన‌ట్టు సమర్థించింది. ఆయుధ పరీక్షలపై వాషింగ్టన్ ద్వంద్వ ప్రమాణాలను వర్తింపజేస్తోందని ఆరోపించింది.

ఇదిలా ఉంటే.. ప్యోంగ్యాంగ్ నుంచి.. ఉత్తర కొరియా చేసిన అణుప‌రీక్ష‌ల‌ను అమెరికా తీవ్రంగా ఖండించింది. శాంతి, అణు నిరాయుధీకరణ దిశగా దశలవారీ చర్యలపై చర్చలను పునఃప్రారంభించడానికి బిడెన్ మరింత సమిష్టిగా, ఉన్నత స్థాయి అంతర్జాతీయ ప్రయత్నాలకు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని వాషింగ్టన్‌లోని ఆయుధ నియంత్రణ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డారిల్ కింబాల్ అన్నారు.