భారత్-పాకిస్తాన్‌ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ స్పందించారు.

ఈ క్లిష్ట పరిస్ధితుల్లో నిజమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, భారత ప్రధాని నరేంద్రమోడీని కోరుతున్నానని, కశ్మీర్ అంశంపై కరచాలనం చేసుకుని కూర్చొని చర్చించుకోవాలని అభ్యర్ధిస్తున్నానని’’ మలాలా ట్వీట్ చేశారు.

దీంతో పాటు ‘‘ సే నో టూ వార్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్ధితులు, ఇలాగే ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో జీవించే ప్రజల గురించి చాలా ఆందోళన చెందుతున్నానన్నారు.

భారత్, పాక్‌ల మధ్య ఆస్తి నష్టం జరగకుండా అంతర్జాతీయ సమాజం సహకరించాలని కోరారు. ‘‘టెర్రరిజం, నిరక్షరాస్యత, వైద్య సదుపాయాల లేమి రెండు దేశాలకు అసలు శత్రువులని ఆమె అభిప్రాయపడ్డారు.