Asianet News TeluguAsianet News Telugu

న్యూయార్క్ లో ఎలకల బెడద.... వాటిని పడితే..170వేల డాలర్లు..!

దీంతో... వాటిని పట్టుకొని...వాటి బెడద నుంచి తమను రక్షించేవారు కావాలని ప్రకటనలు విడుదల చేశారు. న్యూయార్క్ మేయర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 

New York Wants To Hire 'Rat Czar', Will Pay $170,000 Per Year
Author
First Published Dec 3, 2022, 11:31 AM IST

దాదాపు అన్ని గ్రామాల్లో, ఊళ్లల్లో ఎలుకలు తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఒక్కసారి ఇంట్లోకి ఎలుకలు ప్రవేశించాయంటే... ఎక్కడ ఏం కొరికేస్తాయా అని భయపడాల్సి వస్తుంది. అంతేకాదు... ఎలకల వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. దీంతో.. ఆ ఎలుకను పట్టేందుకు విభిన్నప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాగా.... ఇదే సమస్య న్యూయార్క్ నగరానికి వచ్చింది. నూయార్క్ నగరాన్ని ఎలుకలు పట్టి పీడిస్తున్నాయి. దీంతో... వాటిని పట్టుకొని...వాటి బెడద నుంచి తమను రక్షించేవారు కావాలని ప్రకటనలు విడుదల చేశారు. న్యూయార్క్ మేయర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.  ఎలుకను పట్టుకున్నవారికి సంవత్సరానికి  170వేల డాలర్లు ఇస్తామని ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు డిసెంబర్ 1వ తేదీన సోషల్ మీడియాలో పోస్టు కూడా విడుదల చేశారు.

 


మేయర్ కార్యాలయం పోస్ట్ చేసిన జాబితా ప్రకారం, పట్టణ ప్రణాళిక, ప్రాజెక్ట్ నిర్వహణ లేదా ప్రభుత్వ పనిలో నేపథ్యం కూడా ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయపడుతుంది, కొత్తగా క్రియేట్ చేసిన ఈ  ఉద్యోగానికి ఎంపికైన వారికి  సంవత్సరానికి $120,000 నుండి $170,000 వరకు చెల్లిస్తామని ప్రకటించారు. మన కరెన్సీలో రూ.కోటి 38లక్షల 55వేలకు పై చిలుకే కావడం గమనార్హం.

ఆ ఉద్యోగానికి ఎలుకల ఉపశమన డైరెక్టర్‌గా పేరు పెట్టారు. వారు ఎలకలబెడద నుంచి నగరాన్ని కాపాడటమే వారి లక్ష్యం. ఈ ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా పొందుపరిచారు.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే వ్యక్తి కచ్చితంగా నగర నివాసిగా ఉండటం, బ్యాచిలర్ డిగ్రీ చదువు పూర్తి చేసి ఉండాలి. చాలా చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అలాంటివారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.

న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, నగరాన్ని శుభ్రం చేయడానికి, పెరుగుతున్న ఎలుకల ఫిర్యాదులను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా నగరం కొత్త టాప్ ఎలుకల రిమూవర్‌ను నియమించాలని చూస్తోంది. గత రెండు సంవత్సరాల్లో అక్కడ ఎలకల బెడద భయంకరంగా పెరిగిందట.  కరోనా కాలం తర్వాత... వీటి సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios