ఖాట్మాండ్: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సోమవారం నాడు పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు.నేపాల్ పార్లమెంట్ లో కేపీ శర్మ ఓలీ విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నారు. విశ్వాస పరీక్షల్లో ఓలి నెగ్గాలంటే  136 ఓట్లు కావాలి. నేపాల్ పార్లమెంట్ లో 275 మంది సభ్యులున్నారు.  ప్రధాని శర్మకు అనుకూలంగా 93 మంది ఓటు చేశారు. 124 మంది శర్మకు వ్యతిరేకంగా ఓటు చేశారు. 15 మంది ఓటింగ్ కు హాజరు కాలేదు. 

పార్లమెంట్ విశ్వాస పరీక్షల్లో ఓటమితో ఆయన అధికారం నుండి తప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.38 నెలల పాటు  ప్రభుత్వాన్ని నడిపించిన  తరువాత ఆయన ప్రధాని పీఠం నుండి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓలి తన రాజీనామాను నేపాల్ అధ్యక్షుడు బిద్యాదేవి బండారికి సమర్పించనున్నారు. వారంలోపుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం కానున్నాయి. 

నేపాల్  కాంగ్రెస్ పార్టీ నేత షేర్ బహదూర్ డ్యూబా, పుష్ప కమల్ దహల్ ప్రచండ (మావోయిస్టు)  పార్టీ నేత ప్రధాని ఓలిశర్మపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  దేశంలో కరోనా కేసులను అరికట్టడంలో అవినీతిని నిర్మూలించడంలో ఓలి వైఫల్యం చెందారని ఆరోపించారు.