Nepal plane crash: నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో పొఖరా వెళ్లిన ఈ కుటుంబం మహారాష్ట్రలోని ముంబ‌యికి చెందినదిగా తెలుస్తోంది. ఈ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి   

Nepal plane crash: నేపాల్‌లో గల్లంతైన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన తారా ఎయిర్ ఎయిర్‌క్రాఫ్ట్ (Tara Air aircraft) విమానం ఆచూకీ తెలిసింది. టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత కూలిపోయిన ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలను నేపాల్ సైన్యం  గుర్తించింది. విమాన అవశేషాలు ముస్తాంగ్ జిల్లాలోని సన్సోవార్‌ సమీపంలో ఉన్నాయని ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ నారాయణ్ సిల్వాల్ వెల్లడించారు. విమాన శకాల సమీపంలో కొన్ని మృతదేహాలను గుర్తించామని తెలిపారు. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. విమానం కుప్పకూలిన ప్రదేశానికి చెందిన ఫొటోలను ఆర్మీ విడుదల చేసింది.

తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన  టర్బోప్రాప్ ట్విన్ ఓటర్ 9N-AET విమానం ఆదివారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.55 గంటలకు పొఖారా నుంచి టేకాఫ్‌ అయిన విమానం.. కేవ‌లం 5 నిమిషాల వ్యవధిలోనే రాడ‌ర్ వ్య‌వ‌స్థ‌ నుంచి మిస్సింగ్ అయింది. 

ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారనీ. వారిలో నలుగురు భారతీయులు, 13 మంది నేపాల్ జాతీయులు, ఇద్దరు జర్మన్లు ,​ముగ్గురు సభ్యుల నేపాల్ ఎయిర్ సిబ్బంది ఉన్నారు. అయితే.. 
భారత్‌కు చెందిన నలుగురు.. ఒకే కుటుంబానికి చెందిన వార‌నీ, వీరంతా మ‌హారాష్ట్ర‌లోని ముంబ‌యి వాసులుగా గుర్తించారు. 

ఆదివారం నాటి నేపాల్ విమాన ప్రమాదం తర్వాత మహారాష్ట్రలోని థానేకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు స‌భ్యులు ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని థానేకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నేపాల్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. వారిని అశోక్ త్రిపాఠి(54), అతని భార్య వైభవి బాండేకర్-త్రిపాఠి( 51), కుమారుడు ధన్యస్య త్రిపాఠి( 22), కుమార్తె రితికా త్రిపాఠి(18)గా గుర్తించారు. థానేలోని రుస్తోమ్‌జీ ఎథీనా భవనంలో నివసిస్తున్న త్రిపాఠి కుటుంబం సెలవు కోసం.. నేపాల్‌కు వెళ్లారు. వారు నేపాల్‌లోని పోఖారా నుండి తమ విమానాన్ని మార్చారు.

ప్రమాదానికి కారణం మిస్టరీగా మిగిలిపోయింది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. నేపాల్‌లో పనిచేస్తున్నప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌లైన్స్‌లో తరచుగా జాబితా చేయబడిన తారా ఎయిర్ యొక్క విమాన రికార్డులను ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు.