భూమ్మీద మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు.. అలాంటిది అంతరిక్షంలో నేరం చేస్తే... వినడానికి విడ్డూరంగా ఉన్నా ఓ వ్యోమగామి అంతరిక్షంలో తప్పు చేశారు. వివరాల్లోకి వెళితే.. మెక్‌క్లెయిన్ అనే మహిళా వ్యోమగామి సుమారు 6 నెలల పాటు ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌ (ఐఎన్ఎస్)‌లో గడిపారు.

ఆమెకు భూమి మీద సమ్మర్ వోర్డన్స్ అనే ‘‘భార్య’’ ఉన్నారు. వోర్డన్స్‌కు తెలియకుండా ఆమె వ్యక్తిగత ఆర్ధిక పత్రాలు, బ్యాంకు ఖాతాలను క్లెయిన్ ఐఎన్ఎస్‌లో ఉండగా వినియోగించారు. దీంతో వోర్డన్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఫెడరల్ ట్రేడ్ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.

వోర్డన్స్ కుటుంబసభ్యులు ఇదే నేరంపై క్లెయిన్‌పై నాసాకు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం దీనిపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలోని ఇన్‌స్పెక్టర్ జనరల్ దర్యాప్తు జరుపుతున్నారు. ఒక వ్యోమగామిపై కేసు నమోదు కావడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.