Asianet News TeluguAsianet News Telugu

Nancy Pelosi Taiwan Visit : నాన్సీ ఫెలోసీ పర్యటనతో తప్పుచేశారు.. సైనిక చర్యలు తప్పవు.. చైనా వార్నింగ్...

యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని రెచ్చగొట్టే చర్యగా పరిగణించిన చైనా యూఎస్ పై సైనిక చర్యలు ప్రారంభించాలని నిర్ణయించింది.

Nancy Pelosi Taiwan Visit : China Vows Targeted Military Actions
Author
Hyderabad, First Published Aug 3, 2022, 7:55 AM IST

బీజింగ్ : యూఎస్  హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి చైనా పర్యటనతో వాషింగ్టన్, బీజింగ్ ల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. గడిచిన 25 సంవత్సరాలలో తైవాన్ ను ఈ స్థాయి అధికారులు సందర్శించలేదు. దీంతో దీన్ని ఖవ్వింపు చర్యగా పరిగణించిన చైనా  సైన్యం మంగళవారం "లక్ష్యంగా సైనిక చర్యలను" ప్రారంభించాలని ప్రతిజ్ఞ చేసింది.

నాన్సీ ఫెలోసీ పర్యటనను ఖండిస్తూ చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వు కియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో "దీనిని ఎదుర్కోవడానికి.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హై అలర్ట్‌లో ఉంది. జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి, చైనాలో బయటివారి జోక్యం నిరోధించడానికి,  'తైవాన్ స్వాతంత్ర్యం' వేర్పాటువాద ప్రయత్నాలను నిశ్చయంగా అడ్డుకోవడానికి.. ఇది సైనిక కార్యకలాపాలను ప్రారంభిస్తుంది" అని తెలిపారు.

కాగా, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనపై చైనా మంగళవారం బీజింగ్‌లోని అమెరికా రాయబారిని పిలిచి మందలించిందని రాష్ట్ర మీడియా నివేదించింది. చైనాలోని స్వయం పాలిత ద్వీపాన్ని నాన్సీ ఫెలోసీ సందర్శించడం తప్పని, అది తమ భూభాగంలోనిదేనని వైస్ విదేశాంగ మంత్రి క్సీ ఫెంగ్ రాయబారి నికోలస్ బర్న్స్‌తో చైనా నొక్కి చెప్పింది. దీనిమీద "తీవ్ర నిరసనలు" వ్యక్తం చేశారు.

Nancy Pelosi Taiwan Visit: డ్రాగ‌న్ హెచ్చ‌రిక‌ల‌ను లెక్క చేయ‌ని అమెరికా .. తైవాన్ లో కాలు పెట్టిన US స్పీకర్.

ఇది చాలా దారుణం.. దీన్ని చైనా చూస్తూ ఊరుకోదు అన్నట్టుగా అక్కడి వార్తాసంస్థలు చెబుతున్నాయి. గడిచిన 25 సంవత్సరాలలో తైవాన్‌ను సందర్శించిన యూఎస్ అత్యున్నత అధికారి ఫెలోసీనే. ఆమె పర్యటన ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలను పెంచింది, బీజింగ్ దీనిని పెద్ద రెచ్చగొట్టే చర్యగా పరిగణించింది.

యునైటెడ్ స్టేట్స్ "తన తప్పులకు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది" అని Xie అన్నారు. "తక్షణమే దాని తప్పులను పరిష్కరించాలని, తైవాన్‌లో పెలోసి పర్యటన వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను రద్దు చేయడానికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని" వాషింగ్టన్‌ను కోరారు. కాగా బీజింగ్ హెచ్చరికలను ధిక్కరిస్తూ పెలోసి మంగళవారం ఆలస్యంగా తైవాన్‌లో అడుగుపెట్టారు.

ఈ పర్యటనతో చైనా సైన్యం "అత్యంత అప్రమత్తంగా" ఉందని, ఈ పర్యటనకు ప్రతిస్పందనగా "టార్గెటెడ్ సైనిక చర్యలను ప్రారంభించనుందని" తెలిపింది. బుధవారం నుంచి ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో వరుసగా సైనిక విన్యాసాల ప్రణాళికలను ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios