బ్రెజిల్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆరంభం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం జరుగుతోంది. పర్వత నగరమైన పెట్రోపోలిస్‌ లో కొండచరియలు విరిగిపడి.. 117మంది మృత్యువాత పడ్డారు. 

పెట్రోపోలిస్ : పర్వత నగరమైన Petropolisపై వరదల కారణంగా Mudslides విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య గురువారానికి 117కి పెరిగింది. స్థానిక అధికారుల ప్రకారం ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా 116 మంది ఆచూకీ తెలియలేదని చెప్పారు. రియో డి జనీరో రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ప్రాణనష్టాన్ని ధృవీకరించింది, Rio de Janerio నగరంపైన ఉన్న పర్వతాలలోని German-influenced city పూర్తిగా బురదతో మునిగిపోయిందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

దశాబ్దాల కాలంలో కురిసిన భారీ వర్షపాతం కారణంగా మంగళవారం నగరంలోని వీధుల గుండా వరదనీరు పొంగి పొర్లింది. దీంతో వరదనీరు, బురదలో కార్లు, ఇళ్ల మునిగిపోయాయి. పొంగిపొర్లుతున్న నదిలో రెండు బస్సులు మునిగిపోతున్న దృశ్యాలు ఓ వీడియోలో కనిపించాయి. అందులోని ప్రయాణీకులు కిటికీల నుండి బయటకు తప్పించుకున్నారు. అందులో చిక్కుకుపోయినవారు బైటికి రావడానికి పెనుగులాడుతున్నారు. బస్సుల్లో నుండి బయటపడినా తీరం చేరకుండానే కొందరు కొట్టుకుపోయిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. 

ఇంకా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ.. అప్పటికే విరిగిపడ్డ కొండచరియల కింద చిక్కుకున్న తమవారికోసం చాలామంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ చిన్న కొండచరియ విరిగిపడింది. కానీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం అందుకుంది. దీంతో నివాసితులు, రెస్క్యూ వర్కర్లలో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే వారిని ఖాళీ చేయించాలని అధికారులు సూచించారు.

రోసిలీన్ వర్జీనియా అనే బాధితురాలు అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ మాట్లాడుతూ.. తన సోదరుడు దీన్నుంచి తప్పించుకున్నాడని.. అది అద్భుతమైన విషయం అని.. అయితే స్నేహితుడు ఇంకా దొరకలేదని తెలిపింది. సహాయం కోసం అర్థించడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వైపు కొందరు మట్టిపెళ్లలను తొలగించేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మృతిచెందిన తమ బంధువులకు దెబ్బతిన్న స్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అలా ఇప్పటివరకు 17 మంది అంత్యక్రియలు పూర్తి చేశారు.

రియో పోలీసులు గురువారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సుమారు 200 మంది ఏజెంట్లు చెక్‌పోస్టులు, షెల్టర్‌లతో పాటు నగరంలోని మృతదేహాలను చెక్ చేయడం ద్వారా చనిపోయినవారు, బతికినవారి జాబితాలను చెక్ చేస్తున్నారు. తప్పిపోయిన జాబితాలోని ముగ్గుర్ని స్థానిక పాఠశాలలో కనిపెట్టామని.. దీంతో జాబితా నుంచి వారి పేర్లు తొలగించగలిగామని చెప్పారు.

ప్రతీ చిన్న డిటైల్ ముఖ్యమే కాబట్టి.. కనిపించకుండా పోయినవారి గురించిన ఆనవాళ్లను క్షుణ్ణంగా సేకరిస్తున్నాం అని అధికారులు తెలిపారు. వేసవి విడిదిగా రియోడి జనీరోకు జనాలు వస్తారని... దీనివల్లే ఇక్కడ పర్యాటకంతో పాటు జనాభా పెరిగిందని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం మూడు గంటల్లో 25.8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని రాష్ట్ర అగ్నిమాపక శాఖ తెలిపింది. గత 30 రోజులుగా కురుస్తున్న వర్షాల్లో ఇదే భారీ స్థాయి. రియో డి జెనీరో గవర్నర్ క్లాడియో కాస్ట్రో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 1932 తర్వాత పెట్రోపోలిస్‌లో కురుస్తున్న అత్యంత దారుణమైన వర్షాలు ఇవి అన్నారు. 

ఇంత భారీ వర్షాన్ని ఎవరూ ఊహించలేరని క్యాస్ట్రో అన్నారు. వాతావరణ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా దాదాపు 400 మంది నిరాశ్రయులయ్యారని, 24 మంది సజీవంగా బయటపడ్డారని క్యాస్ట్రో తెలిపారు. వారు అదృష్టవంతులు.. ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడినవారు వారు చాలా తక్కువ మంది ఉన్నారన్నారు. 30యేళ్లుగా పెట్రోపోలిస్‌లో నివసిస్తున్న మచాడో అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదంలో మా ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఒక చిన్న గదిమాత్రం మిగిలింది. అందులోనే మా అమ్మ, మా అక్కాచెల్లెల్లిద్దరు దాక్కుని ప్రాణాలు రక్షించుకున్నారు’ అని తెలిపారు. ‘ఏం జరిగిందో నమ్మలేకపోతున్నాను.. నా స్నేహితులంతా ప్రమాదంలో మరణించారు’ అని చెప్పుకొచ్చాడు. 

ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న 180 మందికి పైగా నివాసితులు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. రష్యా పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వీరికి సంఘీభావం తెలిపారు. పెట్రోపోలిస్ సిటీ హాల్ ఈ విషాదానికి మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఆగ్నేయ బ్రెజిల్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి భారీ వర్షాలతో అల్లాడుతోంది. జనవరి ప్రారంభంలో మినాస్ గెరైస్ రాష్ట్రంలో, అదే నెల సావో పాలో రాష్ట్రంలో జరిగిన సంఘటనల్లో 40 కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.