Mount Marapi : బద్దలైన మరాపి అగ్నిపర్వతం.. 11 మంది మృతి.. మరో 12 మంది గల్లంతు..
Mount Marapi : పశ్చిమ ఇండోనేషియాలో ఉన్న మరాపి అగ్ని పర్వతం విస్పోటనం చెందింది. ఎలాంటి అలజడి లేకుండా ఒక్క సారిగా ఆ పర్వతం నిప్పులు కక్కడంతో అక్కడున్న 11 మంది మరణించారు. మరో 12 మంది గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
mount merapi explosion : ఇండోనేషియాలోని మరాపి అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మందికి పైగా గల్లంతయ్యారు. ఎలాంటి అలజడి లేకుండా ఒక్క సారిగా ఈ అగ్నిపర్వతం బద్దలైంది. ఇది చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో 75 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో 11 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురు గాయాలతో సజీవంగా ఉన్నారని తెలిపారు. అయితే మరో 12 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. కాగా.. ఆదివారం ఈ అగ్ని పర్వతం విస్ఫోటనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఈ వీడియో పుటేజీలో ఆకాశం అంతటా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వ్యాప్తి చెందిన బూడిద కనిపిస్తోంది. చుట్టుపక్కల శిథిలాలు కనిపిస్తున్నాయి. అయితే గల్లంతైన వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ మళ్లీ సోమవారం స్వల్పంగా విస్ఫోటనం సంభవించింది. దీంతో సహాయక సిబ్బంది తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని ‘అల్ జజీరా’ తెలిపింది.
కాగా.. ఆగ్నేయాసియా దేశంమైన ఇండోనేషియాలో దాదాపు 130 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు విస్పోటనం చెందిన మరాపి రెండవ హెచ్చరిక స్థాయిలో ఉంది. అధికారుుల అక్కడి మూడు కిలో మీటర్ల పరిధిలోకి వెల్లకుండి నిషేదం విధించారు. ఇండోనేషియా ద్వీపసమూహం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది, ఇక్కడ ఖండాంతర ఫలకాల కలయిక వల్ల అధిక అగ్నిపర్వత విస్పోటనాలు, భూకంపాలకు కారణంవుతుంది.