న్యూజిలాండ్‌ శుక్రవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి క్రైస్ట్‌చర్చిలో మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దుండగుడి కాల్పులపై న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజును బ్లాక్‌డేగా అభివర్ణించారు. దేశానికి వలస వచ్చిన వారిలో ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.