Russia Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించిన నాటి నుంచి ఉక్రెయిన్ బాంబు శబ్ధాలతో దద్దరిల్లిపోతున్నాయి. రష్యా దాడుల నేపధ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు మెట్రో స్టేషన్‌లు, షాపులు, బార్‌లు, సబ్‌వే స్టేషన్‌లును షెల్టర్ హోమ్స్‌గా మరాయి. వేలాది మంది అందులోనే ఆశ్రయం పొందుతున్నారు.ఈ తరుణంలో సబ్‌వే స్టేషన్ లో తలదాచుకున్న ఓ గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ రాజధాని నగరం దాదాపు రష్యా బలాగాల చేతిలోకి వెళ్లిపోయింది. నగరం మొత్తం సైనిక దాడులు, బాంబుల దాడి మోత, వైమానిక దాడులు మోగుతున్న సైరన్ల మధ్య కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతుంది. ఈ సమయంలో ఇరు దేశాల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. యుద్ద తీవ్రతను రోజురోజుకు పెంచుతున్నారు. ప్రపంచదేశాల నేతల యుద్దం తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నా.. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను ఆక్రమించుకున్నాయి . కీవ్ నగరంపై విరుచుకుపడ్డాయి. యుద్ధ ట్యాంకర్లు నగరంపై దాడి చేస్తుంటే.. ఉక్రెయిన్ సైన్యం గెరిల్లా యుద్దం చేస్తూ.. రష్యా బలగాలను నిలువరిస్తున్నాయి.
ఈ సమయంలో రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కీలక కామెంట్స్ చేశారు. తొలుత.. యుద్దం ఆపి, ఆయుధాలు పక్కనపెడితేనే చర్చలంటూ ప్రకటించిన రష్యా గంటల వ్యవధిలోనే మాట మార్చింది. ఏ మాత్రం తగ్గేదేలే.. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపొద్దు..ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు వెనక్కి తగ్గొద్దంటూ పిలుపు నిచ్చారు. పుతిన్ ను కట్టడి చేయడానికి ఈయూ ఆంక్షలు, అమెరికా సైబర్ దాడులు, నాటో దళాల కీలక సమావేశం, ఇలా ఎన్ని చేసిన రష్యాకు కళ్లెం వేయలేకపోతున్నారు.
ఈ ఉద్రికత్త వాతావరణంలో ప్రాణాలతో బయటపడేందుకు స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లు, షాపులు, బార్‌లు, సబ్‌వే స్టేషన్‌లును షెల్టర్ హోమ్స్‌గా మారాయి. ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఈ సమయంలో ఓ ఉద్వేగ భరిత ఘటన జరిగింది. బాంబుల మోత, క్షిపణుల హోరు, వైమానిక దాడుల సైరన్ల మోత మధ్య ఓ గర్భిణి ప్రసవించింది. పండంటి పాపకు జన్మనిచ్చింది. గత రాత్రి 8.30 గంటల సమయంలో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్న ఓ గర్భిణికి ప్రసావ వేదనతో బాధపడుతుంటడంతో వైద్య సిబ్బంది వచ్చి.. ఆమెకు సహకరించారు. వెంటనే ఆ గర్భణిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి ఈ యుద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని టెటిగ్రామ్ యాప్‌లో కొందరు షేర్ చేశారు. మెట్రో స్టేషన్లనే బంకర్లుగా వాడుతున్న స్థానికులు ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. భయనక, దుర్భర పరిస్థితుల్లో పుట్టిన ఆశకిరణం మని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఫ్లాట్‌ఫామ్‌లను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు.
ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని మెట్రో స్టేషన్‌లు, షాపులు, బార్‌లు, సబ్‌వే స్టేషన్‌లును షెల్టర్ హోమ్స్‌గా మరాయి. వేలాది మంది అందులోనే ఆశ్రయం పొందుతున్నారు. బాంబు దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన పట్టణమైన కీవ్(Kiev)లో మెట్రోతో పాటు బాంబ్ షెల్టర్, మరో 4500 షెల్టర్ హోమ్స్ (Shelter homes) ఉన్నాయి.
సుమారు 50 లక్షల మంది ఉక్రెనియన్లు విదేశాలకు తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. రష్యా దాడుల వల్ల ఇప్పటికే లక్ష మంది చెల్లాచెదురయ్యారు. పోలాండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాలకు ఉక్రెయిన్ శరణార్థులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గురువారం ఒక్క రోజే సుమారు 35వేల మంది పోలాండ్‌లోకి ప్రవేశించారు.
