Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలపై మిలియనీర్ల నిరసనలు.. ‘మాకు పన్ను వేయండి’

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలపై కొందరు మిలియనీర్లు నిరసనలు చేస్తున్నారు. ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధులపై పన్నులు వేసి ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభం బరువును తగ్గించాలని అన్నారు. లివింగ్ కాస్ట్ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
 

millionaires protest against davos meeting of world economic forum conference
Author
New Delhi, First Published May 23, 2022, 3:59 PM IST

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ దావోస్ నగరంలో యేటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు భారీ క్రేజ్ ఉంటుంది. బిజినెస్ మ్యాన్‌లు, రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు, ప్రభుత్వ పాలసీ రూపకర్తలు ఈ సమావేశాలకు వస్తుంటారు. ప్రతి యేటా జరిగే మీటింగ్‌కు ముందస్తుగా ఒక బేస్ లైన్ పెట్టుకుంటారు. ఈ టాపిక్ చుట్టే ప్రధాన చర్చ జరుగుతుంది. దావోస్ మీటింగ్‌లో ముఖ్యంగా పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థల చుట్టూ చర్చలు జరుగుతాయి. కానీ, పన్నుల గురించి, పేదరికం గురించి, లివింగ్ కాస్ట్ గురించి ఇక్కడ చర్చించేవారెవరూ ఉండరు. అయితే, ఈ సారి సమావేశాల్లో పాల్గొంటున్న కుబేరులకు వ్యతిరేకంగా కొందరు మిలియనీర్లు ధర్నాకు దిగారు.

పేట్రియాటిక్ మిలియనీర్స్ అనే ఓ గ్రూపు దావోస్ సమావేశాలకు హాజరయ్యే కుబేరులను నిరసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎదుర్కొంటున్న లివింగ్ కాస్ట్ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచంలోనే కుబేరులపై కొత్తగా పన్నులు విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ గ్రూపునకే చెందిన ఫిల్ వైట్ అనే వ్యక్తి తమ అజెండా గురించి మాట్లాడారు.

ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ దేశాలన్నీ కునారిల్లిపోతుంటే.. ఈ బిలియనీర్లు, ప్రపంచ నేతలు ఇలా నాలుగు గోడల మధ్య ప్రైవేటుగా కలుసుకుని చరిత్రల మూలమలుపుల గురించి మాట్లాడుతుంటారని విమర్శించారు. ఈ సంక్షోభంపై ఆర్థిక పరమైన ప్రభావాలపై చాలా తక్కువ అవగాహన ఉండే వీరి మాటలను రాజకీయ నేతలు వినడం దారుణం అని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల నుంచి అందరికీ ఉపయోగపడే ఫలితం ఏదంటే.. సంపన్నులపై పన్ను విధించడమేనని, తమకు పన్ను వేయండి అని అన్నారు. దావోస్ 2022 సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులపై పన్ను విధించండి అని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios