మెక్సికో సిటీలో ఘెర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన పైప్‌లైన్‌ పేలి 20 మంది దుర్మరణం చెందారు. మరో 54 మంది గాయపడ్డారు. పైప్‌‌లైన్ లీకవడంతో ఇంధనాన్ని తెచ్చుకునేందుకు పలువురు అక్కడకు వెళ్లారు. అదే సమయంలో పేలుడు సంభవించి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి  చికిత్స నిమిత్తం తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.