మెక్సికో: పొరుగింటి వివాహితతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను కలుసుకునేందుకు పెద్ద పనికే పూనుకున్నాడు. ప్రేయసి పడకగదికి పెద్ద సొరంగం తవ్వాడు. ఆ సొరంగం ఆమె భర్త కంటపడింది. దీంతో వారి గుట్టు రట్టయింది.

మెక్సికోలోని టిజువానాకు చెందిన అల్బెర్టో అనే భవన నిర్మాణ కార్మికుడికి పొరుగింటి మహిళ పమేలాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. పమేలా భ్రత జోర్గో ఉద్యోగానికి వెళ్లగానే అల్బెర్టో సొరంగం ద్వారా ఆమె పడకగదికి చేరుకునేవాడు. అలా కొంత కాలంగా ఇరువురు అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. 

కాగా ఓ రోజు జోర్గే కార్యాలయం నుంచి ముందుగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పమేలా, అల్బెర్టోలు తమ పడకగదిలో కనిపించారు. జోర్గేను చూడగానే అల్బెర్టో సోఫా కింద నక్కాడు. అక్కడి సొరంగం ద్వారా అతను మెల్లగా జారుకున్నాడు కూడా. అతను సోఫా కిందికి వెళ్లిన అల్బెర్టో అక్కడ జోర్గేకు కనిపించలేదు. 

దాంతో అతను సోఫాను కొద్దిగా జరిపి చూశాడు. అక్కడ అతనికి సొరంగం కనిపించింది. దాని గుండా అతను వెళ్లగా అది అల్బెర్టో ఇంట్లోకి దారి తీసింది. వివాహితుడైన అల్బెర్టో తన ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా జోరేను వేడుకున్నాడు. ఆ సమయంలో ఇరువురు కలియబడ్డారు. దాంతో అది కాస్తా పోలీసుల దాకా వెళ్లింది. 

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్బెర్టోపై జోర్జో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అల్బెర్టోను అదుపులోకి తీసుకున్నారు.