అధ్యక్షుడు ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ 'నిమిషాలు లెక్కిస్తోంది’ అంటూ డొనాల్డ్ ట్రంప్ మాజీ సహాయకుడు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. 

ట్రంప్ మాజీ రాజకీయ సలహాదారు ఒమరోసా మానిగోల్ట్ న్యూమాన్, మెలానియా ఆమె భర్త ట్రంప్ మధ్య సంబంధం ముగిసిందని, అధ్యక్షుడు ట్రంప్ తో విడాకులు తీసుకోవడానికి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆమె ఎదురుచూస్తున్నారని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. 

మాజీ అప్రెంటిస్ పోటీదారుడు కూడా ట్రంప్ మెలానియా విషయంలో సరిగా లేడని పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలుపు తరువాత అధ్యక్షుడు ట్రంప్ వివాహం విషయంలో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

‘నా అభిప్రాయం ప్రకారం, మెలానియా ట్రంప్ పదవీవిరమణ చేసే వరకు ప్రతి నిమిషం లెక్కిస్తున్నారు. ఆమె అతన్నుండి విడాకులు తీసుకోవచ్చు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రస్తావన తెస్తే ట్రంప్ మెలానియాను శిక్షించే అవకాశం ఉంది’ అని న్యూమాన్ అన్నాడు.

మెలానియా నిర్ణయంతో కోపానికి వచ్చిన ట్రంప్  తన భార్య పౌరసత్వాన్ని  ఉపసంహరించుకునే ప్రయత్నం చేయవచ్చని న్యూమన్ అన్నట్టుగా మిర్రర్.కో.యుకె నివేదించింది.

ట్రంప్ మరో మాజీ సహాయకుడు, యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్కు సీనియర్ సలహాదారుగా నియమించబడిన స్టెఫానీ వోల్కాఫ్ మాట్లాడుతూ వైట్ హౌస్ లో ట్రంప్, మెలానియాలకు ప్రత్యేక బెడ్ రూములు ఉన్నాయని, వారి వివాహం 'వ్యాపారాత్మకం' అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే 2016 లో ట్రంప్ విజయం సాధించినప్పుడు మెలానియా ట్రంప్ కన్నీళ్లు పెట్టుకున్నారని, ట్రంప్ గెలుస్తాడని ఎప్పుడూ ఊహించలేదని ఆనందం వ్యక్తం చేసిందని ఆమె స్నేహితులు అంటున్నారు. 

50 యేల్ల మెలానియా, 74 యేళ్ల ట్రంప్ తో మంచి సంబంధాలున్నట్టుగా చెబుతున్నప్పటికీ వీరి అనుబంధం విషయంలో అనుమానాలే ఉన్నాయి.