అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వైట్ హౌజ్ నుండి బైటికి రాగానే ఆయన సతీమణి మెలినాయా  ట్రంప్ అంతనికి విడాకులు ఇవ్వబోతున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

ఒకవేళ అందరూ అనుకున్నట్టుగానే మెలానియా గనక ట్రంప్ కు విడాకులివ్వడానికి సిద్ధపడితే డైవర్స్ సెటిల్మెంట్ ప్రకారం ఆమెకు 50 మిలియన్ల అమెరికన్ డాలర్లు అందుతాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

15 యేళ్ల క్రితం మెలానియా, ట్రంప్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. పేరు బారన్ ట్రంప్. ఏదెల ఉన్నా మెలానియా విడాకులు తీసుకునే ఆలోచనలో ఉందన్న పుకార్లు మాత్రం చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. 

అధ్యక్షుడు ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ 'నిమిషాలు లెక్కిస్తోంది’ అంటూ డొనాల్డ్ ట్రంప్ మాజీ రాజకీయ సలహాదారు ఒమరోసా మానిగోల్ట్ న్యూమాన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

మెలానియా ఆమె భర్త ట్రంప్ మధ్య సంబంధం ముగిసిందని, అధ్యక్షుడు ట్రంప్ తో విడాకులు తీసుకోవడానికి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆమె ఎదురుచూస్తున్నారని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. 

మాజీ అప్రెంటిస్ పోటీదారుడు కూడా ట్రంప్ మెలానియా విషయంలో సరిగా లేడని పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలుపు తరువాత అధ్యక్షుడు ట్రంప్ వివాహం విషయంలో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఒకవేళ ట్రంప్‌తో మెలానియా విడిపోతే, విడాకుల ఒప్పందం ప్రకారం ఆమెకు 50 మిలియన్ డాలర్లు లభిస్తాయని బెర్క్‌మన్ బాట్జర్ న్యూమాన్ & రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ టౌన్ అండ్ కంట్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మెలానియా, డోనాల్డ్ ట్రంప్ ల మధ్య ఈ పరిష్కారం 14 ఏళ్ల బారన్ మీద చాలా ప్రభావం పడుతుందని  న్యూమాన్ అన్నాడు. 

“నేను టాబ్లాయిడ్లలో చదివిన వాటిని బట్టి చూస్తే, ప్రాధమిక సంరక్షకుడు ఎవరు అనే దానిపై చాలా సందేహాలు ఉన్నట్టున్నాయి. అయితే నా అంచనా ప్రకారం ప్రైమరీ కేర్ టేకర్ మెలానియానే ఉంటుంది. ట్రంప్ బాబును చూడాలనుకున్నప్పుడు వెళ్లి చూసే హక్కులు ఉంటాయి”అని న్యూమాన్ చెప్పారు.

విడాకుల ఒప్పందం ప్రకారం మెలానియాకు 50 మిలియన్ డాలర్లు ముట్టబోతున్నాయని, ఇది భారీ మొత్తం అని ఈ సందర్బంగా న్యూమన్ అన్నారు. న్యూయార్క్ లాంటి మహానగరంలో జీవించడానికి ఇది చాలా పెద్ద మొత్తమే. అయితే ఈ డబ్బులను ఆమె ఎలా ఉపయోగించబోతోందనేది ఇప్పడైతే చెప్పలేం అన్నారు. అంతేకాదు విడాకుల తరువాత ఎలాంటి జీవనశైలి ఉండబోతుందనేది నాకో అంచనా ఉంది. కాబట్టి ఇది మంచి అమౌంటే అని”అని ఆమె పేర్కొంది.

ట్రంప్  అంతకు ముందు రెండు వివాహాలలో కూడా ముందస్తు ఒప్పందాల ప్రకారం పరిష్కారాలు వచ్చాయని గమనించాలన్నారు. ట్రంప్ రెండో భార్య, మార్లా మాపుల్స్  2 మిలియన్ డాలర్లు పొందగా, అతని మొదటి భార్య ఇవానా ట్రంప్ కు 14 మిలియన్ డాలర్లు, కనెక్టికట్ లోని ఒక భవనం, న్యూయార్క్ అపార్ట్మెంట్, మార్-ఎ-లాగోకు సంవత్సరంలో ఒకసారి వెళ్లే అవకాశం లభించింది.

ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ : ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలానియా ట్రంప్ రచయిత మేరీ జోర్డాన్ ప్రకారం, ట్రంప్ తన మిగతా వివాహాల్లో కలిగిన పిల్లలకు లాగానే బారెన్ కూడా ట్రంప్ వారసుడిగా అన్ని అన్ని ప్రయోజనాలను పొందేలా మెలానియా జాగ్రత్తలు తీసుకుందని అన్నారు.