వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 వాల్‌మార్ట్ స్టోర్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి జొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో ఈ ఘటనలో గాయపడ్డారు. 

కాల్పులకు పాల్పడిన దుండగుడిని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ మీడియాకు చెప్పారు. సాయుధుడైన నిందితుడు  స్టోర్స్ లో జొరబడి కాల్పులకు దిగినట్టుగా ప్రత్యక్షసాక్షులుతెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సాయుధులు కాల్పులు జరుపుతున్న సమయంలో ప్రాణాలు దక్కించుకొనేందుకు భయంతో పరుగులు తీస్తున్నట్టుగా ఆ దృశ్యాల్లో కన్పిస్తున్నాయి.

అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో 20 మంది మృతి చెందితే, మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్టుగా స్థానిక అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.