భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి... పొరిగింటి వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశాడు.  ఈ సంఘటన పాకిస్తాన్ లోని సూర్జనీ నగరంలో చోటుచేసుకుంది. కాగా... నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కరాచీలోని సూర్జనీ ప్రాంతానికి చెందిన ఫైసల్ కి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. కాగా... నెల రోజుల క్రితం ఫైసల్ కి భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆమె తన సోదరితో కలిసి నివసిస్తోంది. కాగా... ఆ సమయంలో ఆమెకు షాహీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆమెకు కొత్త సిమ్‌ ఇచ్చి తరచూ మాట్లాడుకునేవారు.ఈ విషయం తెలుసున్న ఫైసల్‌ భార్యను నిలదీశాడు. అలాగే షాహీన్‌ ఇంటికి వెళ్లి అతని తండ్రికి విషయం చెప్పి కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు. అయినప్పటికి షాహీన్‌ తన అక్రమ సంబంధాన్ని అలాగే కొనసాగించాడు. 

దీంతో కోపోద్రిక్తుడైన ఫైసల్‌ షాహీన్‌ను హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. ఈ నెల 14న షాహీన్‌ ఇంటికి వెళ్లి మత్తుమందు ఇచ్చి కత్తితో దారుణంగా పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అధిక రక్తస్రావం జరిగి ఫైసల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. షాహీన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫైసల్‌ను అదుపులోకి తీసుకున్నారు.