5 అంగుళాల కత్తితో మహిళ గుండెల్లో పొడిచి చంపేశాడో వ్యక్తి. ఆమెను తిరిగి బతికిస్తానని చెప్పి.. ఏవో ఆచారాలు చేస్తూ రోజుల తరబడి మృతదేహాన్ని గదిలోనే ఉంచుకున్నాడు. 

యుఎస్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయినవారిని బతికిస్తానని చెప్పి ఓ వ్యక్తి.. దీనికోసం ఓ మహిళను గుండెల్లో పొడిచి చంపాడు. ఆ తరువాత ఆమెను బతికించడానికి ప్రయత్నించే క్రమంలో రోజుల తరబడి ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఈ సంఘటన గత నెలలో జరిగింది. నిందితుడు 34 ఏళ్ల స్టీఫెన్ జోసెఫ్ ఆండర్సన్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, నిందితుడు 33 ఏళ్ల రెబెక్కా లిన్ లాంబెర్ట్ అనే మహిళను నవంబర్‌లో తన ఇంటికి దగ్గరగా ఉన్న పార్కులో కలిశాడు. తరువాత వారిద్దరూ కలిసి అతని ఇంటికి వెళ్లారు. వారిద్దరూ ఆండర్సన్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మెథాంఫేటమిన్ తీసుకున్నారు. ఆ తరువాత కాసేపటికి అండర్సన్ స్నానం చేయడానికి వెళ్లి, తిరిగి వచ్చేసరికి బెడ్రూంలో లాంబెర్ట్ చనిపోయి ఉందని అతను పోలీసులకు తెలిపారు. 

మరోసారి ఉత్తరకాశీలో భూప్రకంపనాలు.. అర్ధరాత్రి వేళ భయంతో జనం పరుగులు ..

అయితే, పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో చనిపోయిన వారిని బతికించే ప్రక్రియను అండర్సన్ నమ్ముతాడని.. తనకు ఆ శక్తి ఉందని నమ్మాడని తెలిపారు. అందుకోసం ఆ ఆచారాల్లో భాగంగా ఐదంగుళాల కత్తితో మహిళ గుండెల్లో పొడిచి చంపాడు. ఆ తరువాత ఆ స్త్రీని బ్రతికించటానికి ప్రయత్నించినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తరువాత నవంబర్ 14న, అతను చేతిలోకత్తి, సుత్తితో వీధిలో తిరుగుతూ కనిపించాడు. ఇది గమనించిన పోలీసులు అలర్ట్ అయ్యి.. అతడికి తుపాకులు ఎక్కుపెట్టారు. కత్తిని పడేయాలని చెప్పారు.

ఆ తరువాత అండర్సన్‌ను మానసిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ అతను తన తల్లికి ఫోన్ చేసి తన పిల్లలను పడకగదికి దూరంగా ఉంచమని చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన అతని తల్లి వెంటనే అతని ఇంటికి వెళ్లింది. అక్కడ బెడ్రూంలో ఆమె లాంబెర్ట్ మృతదేహాన్ని గుర్తించింది. వెంటనే 911కి కాల్ చేసిందని పోలీసులు తెలిపారు.

ఆ తరువాత ఆండర్సన్ మానసిక ఆరోగ్యకేంద్రం నుంచి విడుదలయ్యాడు. అయితే మహిళ అనుమానాస్పద హత్య కేసులో బుధవారం పోలీసులు అతడిని అతడి ఇంట్లోనే అరెస్టు చేశారు. అండర్సన్ అతని మీద మోపిన ఆరోపణలను అంగీకరించి జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

అతనిపై అనుమానిత ప్రవర్తనకు సంబంధించిన ఒక నేరం, శరీరాన్ని చిధ్రం చేయడం, హత్య విషయాన్ని చెప్పకుండా దాచడంలాంటి నేరాల కింద కేసులు నమోదు చేశారు. నేరస్తుడే కాకుండా నిషేధిత ఆయుదాలను కలిగి ఉన్నాడని.. ఉద్దేశపూర్వకంగా మహిళను చంపేశాడని ఆరోపణలు కూడా మోపారు.