Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్: వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితుడికి ఉరిశిక్ష

 జూమ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా సింగపూర్ లో ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించింది ఆ దేశ సుప్రీంకోర్టు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను సింగపూర్ లో  లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో జూమ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా నిందితుడికి శిక్ష విధించింది కోర్టు.

Man Sentenced To Death Via Zoom Call, First For Singapore
Author
Singapore, First Published May 20, 2020, 12:52 PM IST

సింగపూర్: జూమ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా సింగపూర్ లో ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించింది ఆ దేశ సుప్రీంకోర్టు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను సింగపూర్ లో  లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో జూమ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా నిందితుడికి శిక్ష విధించింది కోర్టు.

మలేషియాకు చెందిన 37 ఏళ్ల పునితాన్ జెనాసన్ 2011లో హెరాయిన్‌ డ్రగ్‌ను అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబట్టాడు. దీంతో అతనిపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా పునితాన్ కు సుప్రీంకోర్టు ఉరిశిక్షను విధించింది.

జూమ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించడం దేశంలో ఇదే తొలిసారి అని ఆ దేశానికి చెందిన సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి చెప్పారు. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి కేసుల విచారణను చేపట్టడం లేదు. అయితే చాలా రోజులుగా కోర్టులు తెరవకపోవడంతో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కేసుల విచారణను ప్రారంభించింది సుప్రీంకోర్టు. 

also read:రెండేళ్ల వయస్సులో కిడ్నాప్: 32 ఏళ్ల తర్వాత పేరేంట్స్‌ను చేరుకొన్న కొడుకు

నిందితుడి తరపు న్యాయవాది కూడ వీడియో కాన్పరెన్స్ ద్వారానే తన వాదనలను విన్పించారు. నిందితుడికి వ్యతిరేకంగానే అన్ని ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భావించాడు. దీంతో అతడికి ఉరిశిక్షను విధించారు.

నిందితుడి తరపు న్యాయవాది ఈ శిక్షపై మరోసారి అప్పీల్ కు వెళ్తామని చెప్పారు. జూమ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా శిక్ష విధించడం సరైందికాదన్నారు. అక్రమ డ్రగ్ సరఫరాపై సింగపూర్ లో కఠిన చట్టాలు ఉన్నాయి. డ్రగ్ సరఫరా చేస్తూ పట్టుబడితే కఠినంగా శిక్షించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios