ఓ వ్యక్తి విమానంలో మహిళా ప్రయాణికురాలి ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. నాలుగు సార్లు హస్తప్రయోగం చేసుకుని.. తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
సీటెల్ : సీటెల్ నుండి ఫీనిక్స్‌కు వస్తున్న విమానంలో దారుణం జరిగింది. ఈ మూడు గంటల విమాన ప్రయాణం.. ఓ మహిళకు భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. విమాన ప్రయాణ సమయంలో ఒక మహిళా ప్రయాణికురాలి ముందు కనీసం నాలుగు సార్లు హస్తప్రయోగం చేశాడో వ్యక్తి. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆంటోనియో షెర్రోడ్ మెక్‌గారిటీ అనే వ్యక్తి తన ప్యాంటు కిందకు లాగి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడని విచారణలో తేలింది.
ఈ ఘటన ఏప్రిల్ 2న జరిగింది. ఆ రోజు స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత నిందితుడిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మెక్‌గారిటీ తాను ఏ తప్పు చేయలేదని, వాస్తవానికి "ఇది ఒక రకమైన కింకీగా భావించాను" అని పోలీసులకు చెప్పాడని సమాచారం.
ఫిర్యాదు ప్రకారం.. “మెక్‌గారిటీ 11F సీటులో కూర్చున్నాడు. సదరు మహిళా సాక్షి సీటు 11Eలో కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానం గాలిలో ఉండగా, మెక్‌గారిటీ తన ప్యాంటును కిందికి దించి.. షర్టును పైకి లాగాడు. దీంతో అతని పురుషాంగాన్ని బైటికి కనిపించేలా చేశాడు. ఆ తరువాత హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు.
అందుతున్న సమాచారం ప్రకారం.. అతని పక్కన కూర్చున్న మహిళ ఇతడి అసభ్య ప్రవర్తనను గమనించి, రహస్యంగా మెక్‌గారిటీ చిత్రాలను తీయడం ప్రారంభించింది. ఇది గమనించని మెక్‌గారిటీ దాదాపు ఒక గంట పాటు హస్తప్రయోగం చేసుకున్నాడు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. అతను పడుకున్నాడని నిర్థారించుకున్న తరువాత ఆ మహిళ ఆ సంఘటన గురించి విమాన సిబ్బందికి చెప్పింది. వెంటనే విమాన సిబ్బంది ఆమె సీటు మార్చారు.
ఆ తరువాత ఈ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఫీనిక్స్‌లో దిగినప్పుడు, పోలీసు అధికారులు మహిళను ఇంటర్వ్యూ చేశారు, మెక్‌గారిటీ "అతని ఎడమ, కుడి రెండు చేతులను ఉపయోగించి నాలుగు వేర్వేరు సందర్భాలలో" హస్తప్రయోగం చేయడం తాను చూశానని ఆమె చెప్పుకొచ్చింది.
నిందితుడు మెక్‌గారిటీ ఫెడరల్ ఆరోపణలతో పాటు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ నుండి జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఏజెంట్లు మెక్‌గారిటీని ఇంటర్వ్యూ చేశారు. విమానంలో తన ప్రవర్తనను నిందితుడు అంగీకరించాడు. అంతేకాదు తాను హస్తప్రయోగం చేసుకుంటే అభ్యంతరమా అని మహిళా ప్రయాణికురాలిని అడిగానని నిందితుడు పేర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
"మెక్‌గారిటీ చెబుతున్న దాని ప్రకారం.. అతను అడిగినప్పుడు మహిళా ప్రయాణికురాలు... 'నిజానికి అంత పెద్దగా పట్టించుకునే విషయం కాదు’ అన్నట్టుగా తన చేతులను గాలిలో ఊపుతూ చెప్పింది.. అని తెలిపాడు. ఇది మెక్‌గారిటీ ప్రతిస్పందన "ఒక రకమైన కింకీ" అని భావించిందని, తాను హస్తప్రయోగం చేసుకోవడం వల్ల మహిళకు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకోవడం వల్లే అలా జరిగిందని అతను చెప్పుకొచ్చాడు.
కాగా, ఈ సంఘటన తరువాత, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ మెక్‌గారిటీపై జీవితకాల నిషేధాన్ని విధించినట్లు డైలీ బీస్ట్ పత్రిక సమాచారం. “ఏప్రిల్ 2న, SEA నుండి PHXకి 3814 విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన గురించి మాకు సమాచారం అందింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు సిబ్బందికి పరిస్థితి వివరించారు. కెప్టెన్ కి విషయం తెలియగానే.. విమానం ల్యాండ్ అయిన వెంటనే లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను సంప్రదించాడు”అని ఎయిర్‌లైన్ తెలిపింది.
"మేము వెంటనే ప్రయాణీకుడిని మా నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచాం, ఫలితంగా Southwestలో ప్రయాణించకుండా జీవితకాల నిషేధం విధించబడింది" అని Southwest ప్రతినిధి చెప్పారు.
