Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో 125 పాములు.. విగతజీవిగా ఇంటి యజమాని.. అసలేం జరిగిందంటే..?

అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ వ్యక్తి విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు వచ్చి ఇంటిలో తనిఖీ చేశారు. ర్యాకులు, ఇతర సొరుగుల్లో నుంచి కనీసం 125 పాములు బయటపడ్డాయి. ఇందులో విషపూరితమైనవి, విషం లేని పాములూ ఉన్నాయి. స్పిట్టింగ్ కోబ్రాలు, బ్లాక్ మాంబాలు, 14 అడుగుల పొడువున్న పసుపురంగులోని బర్మీస్ పైథాన్, ఇతర సరిసౄపాలు ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 

man found dead in america house surrounded by 125 snakes
Author
New Delhi, First Published Jan 22, 2022, 4:28 PM IST

న్యూఢిల్లీ: అమెరికా(America)లో మేరీలాండ్ రాష్ట్రంలోని ఓ ఇంటిలో ఒక్కడే జీవిస్తున్నాడు. ఆయనతో చుట్టుపక్కల వాళ్లు సన్నిహితంగా మెలుగుతుంటారు. ఒక్కడే నివసించే ఆ వ్యక్తి ఒక రోజు మొత్తం ఇంటి నుంచి బయటకు రాలేడు. ఇది పొరుగునే నివసిస్తున్న ఓ వ్యక్తికి అనుమానం తెప్పించింది. మరో రోజూ చూడలేకపోయాడు. ఇంటికి వెళ్లి చూశాడు. ఆయన నేలపై విగతజీవిగా పడి ఉండటం చూసి ఖంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ వ్యక్తి మరణానికి ఏదైనా కారణం ఆ ఇంటిలో దొరుకుతుందేమోనని వెతికి చూశారు. ఇంటిలోని ర్యాక్‌లు తీయగా పుట్టల కొద్దీ పాములు నేలపై పడుతుండటాన్ని చూసి వారంతా నిర్ఘాంతపోయారు. ఆ ఇంటిలో కనీసం 125 పాముల(Snakes)ను వారు చూశారు. అందులో విషం లేనివి ఉన్నాయి. అత్యధిక విషమున్న(venomous) పాములూ ఉన్నాయి. స్పిట్టింగ్ కోబ్రాలు, బ్లాక్ మాంబాలు, 14 అడుగుల పొడువున్న పసుపురంగులోని బర్మీస్ పైథాన్, ఇతర సరిసౄపాలు ఉన్నాయి. ఈ ఘటన మేరీలాండ్‌లోని చార్లెస్ కౌంటీలో చోటుచేసుకుంది.

దీంతో స్థానికులు సహా పోలీసులు షాక్ తిన్నారు. అయితే, కొన్ని పరీక్షలు చేసి.. ఆయన మరణానికి ఫోల్ ప్లే ఏమీ కనిపించడం లేదని పోలీసు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం కోసం బాల్టిమోర్‌లోని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ అధికారికి మృతదేహాన్ని తరలించారు. కానీ, ఒక వ్యక్తి ఇన్ని రకాల పాములను సేకరించడం చాలా అరుదు అని అధికారులు చెబుతున్నారు. అరుదైన పాముల కలెక్షన్ అది కూడా.. వందకు మించి పాములను ఇంట్లో సేకరించుకోవడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. అమెరికాలో విషపూరిత పాములను సేకరించడం చట్ట విరుద్ధమైన చర్య.

చార్లెస్ కౌంటీ యానిమల్ కంట్రోల్ ప్రతినిధి జెన్నిఫర్ హ్యారిస్ ఈ ఉదంతంపై స్పందించారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఈ ఘటనతో చాలా భయంతో ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఒక్క పాము కూడా స్వేచ్ఛగా ఇక్కడ తిరగడం లేదని వివరించారు. ఇక్కడి స్థానికులకు పాముల భయం ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. మరణించిన వ్యక్తి గురించి స్పందిస్తూ.. ఇంత పెద్ద మొత్తంలో పాములను సేకరణ చూడటం తన కెరీరల్‌లో ఇదే తొలిసారి అని ఆమె పేర్కొన్నారు.

ఇదే మేరీలాండ్ రాష్ట్రంలో ఇంట్లోని పాములు(Snakes) వెళ్లగొట్టాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి ఏకంగా ఇంటినే బూడిదపాలు చేశాడు. రూ. 13.55 కోట్ల ఆ ఇల్లు కాలిపోయి(burned) నేలకూలడం మీద   నెటిజన్లు చర్చ పెట్టారు.చుట్టుపక్కల పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఆ ఇంటిలో పాముల బెడద ఉన్నది. తరుచూ ఆ ఇంటికి పాములు రావడంపై ఆ ఇంటి యజమానికి చిరాకు తెప్పించింది. ఎలాగైనా వీటిని వెళ్లగొట్టాలని అనుకున్నాడు. ఇంట్లో ఉష్ణోగ్రతలు పెంచి అంటే వేడిమి పుట్టించి పొగ ద్వారా పాములను వెళ్లగొట్టాలని((Smoke Out)) భావించాడు. అందుకోసం బొగ్గును ఉపయోగించాలని అనుకున్నాడు. పొగను పుట్టించడానికి ఆయన బొగ్గను సేకరించుకున్నాడు.

అయితే, ఆ బొగ్గను పేలిపోయే ప్రమాదం ఉన్న వస్తువుల దగ్గర ఉంచి పెద్ద తప్పు చేశాడు. ఆ బొగ్గకు నిప్పు అంటించిన తర్వాత దానితో సమీపంలోని పేలిపోయే ముప్పు ఉండే వస్తువులు బ్లాస్ట్ అయ్యాయి. బొగ్గు ద్వారా ఏర్పడ్డ నిప్పు ఆయన నియంత్రణలో ఉన్నప్పటికీ ఈ వస్తువుల పేలుడు ఒక్కసారిగా పరిస్థితులను తారుమారు చేశాయి. ఆ తర్వాత ఆ ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios