ఓ వ్యక్తి నలుగురిని హత్య చేశాడు. వారిలో ఒకరి శవాన్ని కారులో పెట్టుకొని ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. తాను హత్య చేశానని... అరెస్టు చేయండి అంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. కాగా... అతను చెప్పిన మాటలను పోలీసులు కూడా నమ్మలేకపోవడం గమనార్హం. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కాలిఫోర్నియాకు చెందిన శంకర్ హాంగడ్(53) తన కుటుంబసభ్యులు, బంధువులను నలుగురిని హత్య చేశాడు. వారిలో ఒకరిని కారులో పెట్టుకొని వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే... ముందు అతను చెప్పింది పోలీసులు కూడా నమ్మలేదు. అయితే... అతను కారులో శవాన్ని చూపించేసరికి అతను చెప్పింది నిజమని పోలీసులు కూడా నమ్మాల్సి వచ్చింది.

వెంటనే అతను చెప్పిన అడ్రస్ కి పోలీసులు వెళ్లగా... అక్కడ మరో మూడు శవాలు కనిపించాయి. మృతులంతా శంకర్ హాంగడ్ కి బంధువులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా... ఇప్పటి వరకు ఏ ఒక్కరూ తమ ముందుకు వచ్చి హత్య చేశామని అంగీకరించలేదని పోలీసులు  చెబుతున్నారు. అందుకే అతను చెప్పింది నిజమని నమ్మలేకపోయామని వారు చెబుతున్నారు.

కాగా... నలుగురిని ఎందుకు హత్య చేశాడు అన్న విషయం మాత్రం తెలీలేదు. అతని మానసిక పరిస్థితి సరిగా ఉందో  లోదే అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.