Maldives: భారత్, చైనా.. మధ్యలో మాల్దీవులు! మన దేశ సైన్యాన్ని వెనక్కి పంపాలని ఎందుకు అనుకుంటున్నది?

భారత్, చైనాల మధ్య సరిహద్దులో ఘర్షణాపూరిత వాతావరణం ఇంకా కొనసాగుతున్నది. ఈ తరుణంలో ఉభయ దేశాలకు వ్యూహాత్మక భౌగోలిక ప్రాంతంలో మాల్దీవుల దేశం ఉన్నది. ఈ దేశంలో ఉభయ దేశాలూ పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నాయి. తాజాగా, ఆ దేశాన్ని కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఆయన భారత సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని మన దేశానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి ఉన్న ప్రాధాన్యత ఏమిటీ?
 

maldives new president mohamed muizzu wants indian troops out of the island country, know why kms

న్యూఢిల్లీ: ఆసియా ఖండంలో ఇప్పుడు భారత్, చైనాలు శక్తివంతమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న దీవుల సముదాయ దేశమైన మాల్దీవులకు ప్రాధాన్యత పెరిగింది. ఈ దేశానికి ఇటు భారత్, అటు చైనా తమ వంతు సహాయాన్ని అందిస్తూ అందుబాటులో ఉంచుకుంటున్నాయి. ఇప్పుడు ఆ దేశం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంది. ఆ అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు కీలకమైన అభిప్రాయాన్ని తెలిపారు. తమ దేశంలో ఉన్న కొద్దిపాటి భారతీయ సైనికులను తిరిగి వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ముయిజ్జు సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ముయిజ్జు ఈ విజ్ఞప్తి చేశారు. ఈ ద్వీప దేశంలోని భారత మిలిటరీ ప్లాట్‌ఫామ్స్ ఆ దేశ ప్రజల కోసం వినియోగించుకునే సాధ్యమయ్యే పరిష్కారాల కోసం చర్చలు జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మాల్దీవుల్లో భారత జవాన్లు:

మాల్దీవుల్లో 70 మంది భారత జవాన్లు ఉన్నారు. మన దేశం స్పాన్సర్ చేసిన రాడార్లు, ఇతర సర్వెలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేస్తారు. ఆ దేశ ఎకనామిక్ జోన్‌లను పరిరక్షణ కోసం భారత యుద్ధ నౌకలు పహారా కాస్తాయి. భారత సైన్యం సేవలను ఆ దేశ కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కూడా గుర్తించారు. విపత్తులు, ఆరోగ్య అత్యయిక పరిస్థితులు, ఆపత్కాలాల్లో భారత హెలికాప్టర్లు గణనీయమైన సేవలు అందించాయని మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఆఫీసు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ దేశ ప్రజా ప్రయోజనాలు, విపత్కాలాల్లో సహాయం, సముద్ర జలాల  రక్షణలోనూ భారత్‌ ఆ దేశానికి సహాయం చేసిందని కేంద్ర విదేశాంగ శాఖ ఇటీవలే పేర్కొంది.

చైనా ఫ్యాక్టర్:

భారత్, చైనాలకు వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతంలో ఉన్న మాల్దీవుల్లో ఉభయ దేశాలు పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి తోడ్పడ్డాయి. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మాత్రం ఈ రెండు దేశాలూ తమకు ముఖ్యమేనని సంతులన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు దేశాల్లో దేనితోనూ వైరం పెట్టుకునేంత పెద్ద దేశమేమీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. మోయిజ్జు సీనియర్ అబ్దుల్లా యమీన్ 2013 నుంచి 2018 వరకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనాకు సన్నిహితంగా వ్యవహరించేవారు. మధ్యలో మొహమ్మద్ సోలిహ్ మాత్రం భారత్ నుంచి సహాయ సహకారాలు తీసుకోవడంలో వెనుకాడలేదు. కానీ, మళ్లీ ఇప్పుడు యమీన్ అనుయాయుడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడంతో ఆ దేశంలో చైనా ప్రాబల్యం పెరుగుతుందనే సంశయాలు ఉన్నాయి.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేసి 111 సార్లు కత్తితో పొడిచి చంపిన నేరస్తుడికి రష్యా అధినేత పుతిన్ క్షమాభిక్ష! ఎందుకు?

ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త అధ్యక్షుడు స్పష్టమైన ప్రకటన చేశారు. భారత మిలిటరీని వెనక్కి పంపి ఆ స్థానంలో చైనా మిలిటరీని భర్తీ చేసే ఆలోచనలేమీ లేవని చెప్పారు. ప్రతి దేశానికి భద్రత విషయంలో ఓ రెడ్ లైన్ ఉంటుందని, తమకూ అలాంటి రెడ్ లైన్ ఉంటుందని, ఇతర దేశాల ఆ లైన్‌లను తాము గౌరవిస్తామని పరిమితులను ఆయన చెప్పకనే చెప్పారు. అయితే, భారత్, చైనాలతో సమాన దూరంలో ఉంటామని, ఉభయ దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు అవసరం అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios