పోర్న్ వెబ్ సైట్‌లకు ఈయూ చట్టాల తలనొప్పి.. ఆ నిబంధనలు పాటించాలటా!
మూడు అతిపెద్ద పోర్న్ వెబ్ సైట్లపై యూరోపయిన్ యూనియన్ కఠిన చట్టాలను ప్రయోగించనుంది. ఏజ్ వెరిఫికేషన్ ద్వారా వాటి కంటెంట్ మైనర్లకు చేరకుండా అడ్డుకునే వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఈ చట్టాలు ఆదేశిస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని నిబంధనలు ఈ సైట్లకు కచ్చితంగా పాటించాల్సి వస్తున్నది.
మూడు అతిపెద్ద పోర్న్ వెబ్ సైట్లపై యూరోపియన్ యూనియన్ కఠినమైన చట్టాలను ప్రయోగించనుంది. పోర్న్ హబ్, ఎక్స్‌వీడియోస్, స్ట్రిప్‌చాట్‌లకు ఈ తలనొప్పి కొత్తగా ఎదురుకాబోతున్నది. ఈ వెబ్ సైట్లలోని వీడియోలు, కంటెంట్ మైనర్లకు చేరకుండా చూసుకోవడానికి కచ్చితత్వంతో ఏజ్ వెరిఫికేషన్ మెకానిజం నిర్వహించాల్సిందేనని ఈయూ చట్టాలు ఆదేశిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో ఈ సైట్ల యూజర్లు నెలకు కనీసం 45 మిలియన్లకు చేరుతున్న తరుణంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈయూ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (డీఎస్ఏ) ప్రకారం, ఈ పోర్న్ సైట్లు వెరీ లార్జ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కేటగిరీలోకి వస్తున్నాయి.
ఈ పోర్న్ వెబ్ సైట్లకు నాలుగు నెలల గడువు ఉన్నది. ఇంతలోపు ఈయూ కఠిన చట్టాలను అమలు చేసి తీరాల్సిందే. అక్రమ సంబంధాలకు సంబంధించిన కంటెంట్, డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ వంటి వాటిని ఆపడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మైనర్లు వారి వెబ్ సైట్లు ఉపయోగించకుండా పటిష్టమైన ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈయూ డీఎస్ఏ చట్టాలన్నింటినీ తూచా తప్పకుండా పాటించాలి. పాటిస్తున్నదో లేదో థర్డ్ పార్టీ పరీక్షిస్తుంది కూడా.
కొత్త చట్టాల ప్రకారం లొకేషన్స్ నిబంధనలను కూడా పాటించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ సైట్లు ప్రపంచవ్యాప్తంగా సంపాదిస్తున్న వాటిలో ఆరు శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.
వెరీ లార్జ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇవి రెండో గ్రూపు కంపెనీలు. తొలి గ్రూపు కంపెనీలైన గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వాటిపై చట్టాలను ఏప్రిల్‌లోనే ప్రయోగించారు.