Asianet News TeluguAsianet News Telugu

దావూద్ పై విషప్రయోగం, లష్కరే తోయిబా ఉగ్రవాది హతం... అసలు పాక్ లో ఏం జరుగుతోంది?

పాకిస్థాన్ లో వరుసగా ఉగ్రవాదుల హత్యలు జరుగుతున్నాయి. తాజాగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో రిక్రూటర్ గా వ్యవహరిస్తున్న మరో  టెర్రరిస్ట్ గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యాడు. 

Lashkar-e-Taiba Terrorist Habibullah Murder in Pakistan AKP
Author
First Published Dec 18, 2023, 10:38 AM IST

Pakistan : తుపాకీ చేతపట్టి హింసను ప్రేరేపిస్తున్నవాడు అవే బుల్లెట్లకు బలయ్యాడు. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హబిబుల్లా అలియాస్ బోలా ఖాన్ అలియాస్ ఖాన్ బాబును గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆదివారం సాయంత్రం పాకిస్థిన్ లోని ఖైబర్ పక్తున్వా ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.  

పాకిస్థాన్ లో  గతకొంతకాలంగా ఉగ్రవాదులే టార్గెట్ గా కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఉగ్రవాదులు కాల్పుల్లో మృతిచెందగా తాజాగా హబిబుల్లా ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు కరుడుగట్టిన టెర్రరిస్ట్ మాత్రమే కాదు యువతను లష్కరే తోయిబాలో చేర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్న రిక్రూటర్ కూడా. ఇతడి హత్యతో పాకిస్థాన్ లో కలకలం రేగింది. 

ఇటీవల ఇదే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నాయకుడు మఫ్తీ ఖైజన్ ఫరూఖ్ కూడా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. పాకిస్థాన్ రాజధాని కరాచీలో అతడిని కాల్చి చంపారు. మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే తిరిగి వెళుతుండగా అతడిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడి హతమార్చినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. 

Also Read  మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం? పాకిస్థాన్ లోని కరాచీలో చికిత్స ??

ఖైజర్ ఫరూఖ్ భారతదేశంలోని పలు ఉగ్రదాడులకు సూత్రధారి అయిన హపీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు. ముంబైలో మారణహోమం సృష్టించిన 26/11 ఉగ్రదాడులకు సూత్రధారి కూడా సయీదే. అతడి సన్నిహితుడు ఫరూఖ్, ఇప్పుడు మరో ఉగ్రవాది హబిబుల్లా హత్యతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద గ్రూప్స్ లో కలకలం రేగింది. వరుసగా ఉగ్రవాదులను హతమారుస్తున్న గుర్తుతెలియని వ్యక్తులెవరో భయటపడటం లేదు. 

ఇక అండర్‌వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్‌ నేరస్తుడు దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు... పాకిస్థాన్‌ దేశంలో తలదాచుకున్న అతడు కరాచీలోని ఓ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై విషప్రయోగం చేశారట. దీంతో దావుద్ ఆసుపత్రి పాలయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్త ఊహాగానాలు, చర్చలకు దారితీసింది. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios