Asianet News TeluguAsianet News Telugu

మలేషియాలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి, 14 మంది గల్లంతు

కొండచరియలు విరిగిపడి 20 మంది దుర్మరణం చెందిన ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. ఆ దేశంలోని కౌలాంపూర్ అనే ప్రాంతలో టూరిస్ట్ లు టెంట్ లు వేసుకొని సమయంలో ఒక్క సారిగా కొండచరియలు కూలిపడ్డాయి. 

Landslides in Malaysia kill 20 people, 14 missing
Author
First Published Dec 17, 2022, 9:18 AM IST

మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని టూరిస్ట్ క్యాంప్‌సైట్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 14 మంది గల్లంతయ్యారు. వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

తమిళనాడులో పరువుహత్య : పెళ్లి కాకుండానే గర్భం.. 19యేళ్ల అమ్మాయికి పురుగులమందు తాగించి తండ్రి, మేనత్త ఘాతుకం..

ఈ ఘటనలో రెండు మృతదేహాలు కౌగిలించుకున్న స్థితిలో కనిపించాయని, వారిద్దరూ తల్లీకూతుర్లు కావచ్చని అగ్నిమాపక శాఖ అధికారి నోరజామ్ ఖమీస్ తెలిపారు. కౌలాలంపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో సెంట్రల్ సెలంగోర్‌లోని బటాంగ్ కాలీలో 90 మంది కంటే ఎక్కువ మంది ఉన్న ఈ ప్రదేశంలో కొండచరియలు విరిగిపడ్డాయని జిల్లా పోలీసు చీఫ్ సుఫీన్ అబ్దుల్లా చెప్పారు. 

ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని పీఎం : మోడీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

ఈ ప్రమాదం జరిగినప్పుడు క్యాంప్ లోని టూరిస్ట్ లు నిద్రపోతున్నారని, అదే సమయంలో 30 మీటర్ల ఎత్తులో ఉన్న రహదారి నుంచి కొండచరియలు విరిగిపడటంతో ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు.

దాదాపు 400 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఘటనా స్థలంలో సిబ్బందికి సాయం అందించేందుకు స్నిఫర్ డాగ్‌లను కూడా మోహరించారు. కాగా.. అక్కడ క్యాంప్‌సైట్ నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవని స్థానిక అధికారులు మీడియాతో తెలిపారు. ప్రస్తుతం మలేషియాలో రుతుపవనాల  కాలం అని, అందువల్ల నదులు, ప్రవాహాలు, కొండల సమీపంలో ఉన్న అన్ని క్యాంప్‌సైట్‌లను ఒక వారం పాటు మూసివేస్తామని ఆ దేశ అభివృద్ధి శాఖ మంత్రి న్గా కోర్ మింగ్ తెలిపారు.

జోధ్‌పూర్ సిలిండర్ పేలుడులో 32కు చేరిన మ‌ర‌ణాలు.. కాంగ్రెస్ పై బీజేపీ విమ‌ర్శ‌లు

ఘటనా స్థలాన్ని శుక్రవారం అర్థరాత్రి ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం పరిశీలించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదం చోటు చేసుకున్న క్యాంప్‌సైట్ గత రెండేళ్లుగా చట్టవిరుద్ధంగా పనిచేస్తోందని, దాని నిర్వాహకుడికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన స్థానిక మీడియాతో అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios