బ్రిటన్ మహారాజా చార్లెస్ III వచ్చే ఏడాది పట్టాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మే 6, 2023 తేదీని నిర్ణయించారు. వేడుక వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో జరుగుతుంది. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత ఆమె కుమారుడు చార్లెస్ III బ్రిటన్ రాజుగా ప్రకటించబడ్డారు. కానీ, పట్టాభిషేకం మాత్రం కాలేదు. ఆ పట్టాభిషేక మహోత్సవం వచ్చే ఏడాది అంటే 2023 మే 6న అంగరంగ వైభోగంగా జరుగనుంది. ఈ వేడుకలో చార్లెస్ III ను బ్రిటన్ రాజుగా.. అతని భార్య కెమిల్లాను రాణిగా పట్టాభిషేకం చేస్తారు. ఈ పట్టాభిషేకం శనివారం 6 మే 2023న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరుగుతుంది. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పట్టాభిషేకం బ్రిటన్ రాజ కుటుంబ సంప్రదాయాలు, రాజ వైభవాన్ని ప్రదర్శించడంతో పాటు మహారాజు యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తు పాత్రలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
పట్టాభిషేకం అనేది పూర్తిగా మతపరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా.. భారీ వేడుకగా నిర్వహించబడుతుంది. ఈ వేడుకను ఆంగ్లికన్ కమ్యూనియన్ యొక్క ఆధ్యాత్మిక అధిపతి అయిన కాంటర్బరీ ఆర్చ్ బిషప్ నిర్వహిస్తారు. గత 900 సంవత్సరాలుగా వెస్ట్ మినిస్టర్ అబ్బేలో పట్టాభిషేక వేడుకలు జరుగుతున్నాయి.
పట్టాభిషేక కార్యక్రమంలో చార్లెస్ III ను కిరీటం, రాజ సామగ్రితో అలంకరిస్తారు. మహారాజు తన భార్య ఎంప్రెస్ కెమిల్లాతో పట్టాభిషేకం చేయనున్నారు. ఇది సాధారణంగా కొత్త రాజ్యం సృష్టించబడిన చాలా నెలల తర్వాత జరుగుతుంది. 1066లో విలియం ది కాంకరర్ నుండి వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో పట్టాభిషేకం చేశారు.
ఈ పట్టాభిషేక మహోత్సవానికి కింగ్ చార్లెస్ 260 ఏళ్ల నాటి బంగారు రథంపై వెళ్లనున్నారట. ఎంతో చరిత్ర కలిగిన ఈ రథం 4 టన్నుల ఉంటుందట. ఈ స్వర్ణరథం రాయల్ ఫ్యామిలీ దర్పానికే కాదు వారి చరిత్రకు తార్కాణంగా నిలుస్తోందట.
ఇటీవల బ్రిటన్ క్విన్ ఎలిజబెత్ 2 తన 96 యేటా స్కాటిష్ హాలిడే హోమ్‌లో మరణించారు. ఆమె 70 సంవత్సరాల పాటు బ్రిటన్ రాణి వ్యవహరించారు. రికార్డు సృష్టించారు. బ్రిటీష్ మీడియా ఛార్లెస్ పట్టాభిషేకం సమయంలో జరిగే సాంప్రదాయ వైభవాన్ని కొంత తగ్గించాలనుకుంటున్నట్లు పేర్కొంది, దేశం జీవన వ్యయ సంక్షోభంతో పోరాడుతున్నదని పేర్కొంది. చార్లెస్ యునైటెడ్ కింగ్‌డమ్ దేశానికి రాజు మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, కెనడా, జమైకా, న్యూజిలాండ్ మరియు పాపువా న్యూ గినియాతో సహా 14 ఇతర భూభాగాలకు కూడా అధిపతి.
