Asianet News TeluguAsianet News Telugu

అమెరికానే ప్రథమ శత్రువు: తేల్చేసిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరోసారి తన చర్యలతో అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది.ఈ తరుణంలో ఉత్తరకొరియా కొత్త మిస్సైల్స్ ను ఆవిష్కరించాడు.

Kim Jong-un unveils new submarine-launched missiles as Trump exits lns
Author
Panggang, First Published Jan 15, 2021, 11:49 AM IST


ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మరోసారి తన చర్యలతో అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది.ఈ తరుణంలో ఉత్తరకొరియా కొత్త మిస్సైల్స్ ను ఆవిష్కరించాడు.

గురువారం నాడు జరిగిన సైనిక కవాతులో కొత్త సబ్ మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్‌ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక మీడియా ప్రకటించింది.

ఉత్తరకొరియాను పాలిస్తున్న వర్కర్స్ పార్టీ ఐదేళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఈ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు తన మనసులో మాటను వెల్లడించారు.

అమెరికా తమ ప్రథమ శత్రువుగా ఆయన తేల్చి చెప్పారు. నూతనంగా ఆవిష్కరించిన సబ్ మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రదర్శనను కిమ్ పర్యవేక్షించారు.

భూభాగం వెలుపల ముందుగా శత్రువులను గుర్తించి పూర్తిగా నాశనం  చేసే శక్తి ఉందని  ఉత్తరకొరియా మీడియా తెలిపింది. నీటి అడుగు నుండి అనేక ఎస్ఎల్‌బీఎంలను ఉత్తరకొరియా పరీక్షించింది. క్షిపణులను మోయడానికి కార్యాచరణ జలాంతర్గామిని అభివృద్ది చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అభిప్రాయపడుతున్నారు.

జాతీయ మీడియా విడుదల చేసిన ఫోటోల్లో ఎస్ఎల్‌బిఎమ్ ను పుక్‌గుక్సాంగ్ -5 పేరుతో లేబుల్ వేసింది. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన సైనిక కవాతులో ఆవిష్కరించిన పుక్‌గుక్సాంగ్ -4 కు అప్‌డేట్ వర్షన్ గా భావిస్తున్నారు.ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణతో అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios