పాకిస్థాన్ జర్నలిస్టు అర్షద్ షరీఫ్ హత్యకేసులో కెన్యా మానవ హక్కుల కమిషన్ సంచలన వాస్తవాలను బయటపెట్టింది.జర్నలిస్టు అర్షద్‌ షరీఫ్‌ హత్య ప్రణాళికాబద్ధంగా జరిగిందని కమిషన్‌ పేర్కొంది. ఏఆర్‌వై టీవీ యాంకర్‌గా పనిచేసిన షరీఫ్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌తో సన్నిహితంగా మెలిగేవారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనపై దేశద్రోహం ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.

పాకిస్థాన్ జర్నలిస్టు అర్షద్ షరీఫ్ హత్యకేసులో కెన్యా మానవ హక్కుల కమిషన్ సంచలన వాస్తవాలను బయటపెట్టింది.జర్నలిస్టు అర్షద్‌ షరీఫ్‌ హత్య ప్రణాళికాబద్ధంగా జరిగిందని కమిషన్‌ పేర్కొంది. కెన్యా హ్యూమన్ రైట్స్ కమిషన్ సీనియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ మార్టిన్ మావెన్జినా పాకిస్తానీ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ.. అర్షద్ షరీఫ్ అక్టోబర్ 23న హత్యకు గురయ్యారని, నవంబరు 4న వెలువడిన అతని శవపరీక్ష నివేదిక ప్రకారం.. అతనిని అత్యంత సమీపం నుంచి రెండుసార్లు కాల్చి చంపినట్లు వెల్లడైంది.

ఈ కేసులో ఇది చాలా పెద్ద ఆధారమని అన్నారు. అర్షద్ షరీఫ్ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని కెన్యా అధికారి తెలిపారు. ఆ ప్రదేశంలో అర్షద్ షరీఫ్ ఉన్నట్టు భద్రతా అధికారులకు ఎలా తెలిసింది? పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌తో సన్నిహితంగా మెలిగేవారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనపై దేశద్రోహం ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ కారణంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడని పేర్కొన్నారు.ఈ కేసులో షరీఫ్ ప్రయాణిస్తున్న వాహనం వీ8 ల్యాండ్ క్రూయిజర్ అని చెబుతున్నారు. ఈ వాహనాన్ని కేబినెట్ సభ్యులు, ఎంపీలు, వీఐపీలు వినియోగిస్తారు.

షరీఫ్‌పై దాడి చేసిన వారికి శిక్షణ 

కెన్యా న్యాయవాది, అధికారి మాట్లాడుతూ షరీఫ్‌పై దాడి చేసినవారు చాలా కాలంగా శిక్షణ పొందారని పేర్కొన్నారు. ఎందుకంటే, కదులుతున్న వాహనంలో ఉన్న వ్యక్తిని తలపై కాల్చడం సాధారణ విషయం కాదని అన్నారు.

షరీఫ్ ఇమ్రాన్‌కు సన్నిహితుడు

ఏఆర్‌వై టీవీ యాంకర్‌గా పనిచేసిన షరీఫ్ (49) పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌తో సన్నిహితంగా మెలిగేవారు. ఈ ఏడాది ప్రారంభంలోఏజెన్సీలు అతనిపై దేశద్రోహం, దేశ వ్యతిరేక కథనాలను ప్రచారం చేయడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశాయి. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయాడు. అతను మొదట దుబాయ్, తరువాత లండన్, ఆ తరువాత కెన్యా లో ఆశ్రయం పొందుతున్నాడు.

అక్టోబర్ 23న హత్య

గతనెల (అక్టోబరు)23న కెన్యా రాజధాని నైరోబీ సమీపం ఉన్న పోలీసు పోస్ట్ అనే ప్రాంతంలో అతడిని దుండగులు కాల్చి చంపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది.