Asianet News TeluguAsianet News Telugu

కెన్యాలో 200 మందికి పైగా మృతి ... పాస్టర్ మాటలు విని ప్రాణాల మీదకు

కెన్యాలో క్రిస్టియన్ పాస్టర్ పాల్ మెకెంజీ న్థెంగే పిలుపు మేరకు చాలా మంది ఆకలితో చనిపోయారు. పోలీసులు ఇప్పటివరకు 201 మృతదేహాలను వెలికితీశారు. ఆకలితో మరణిస్తే.. ఏసుక్రీస్తును కలవాలని ఆరోపించారు. ప్రస్తుతం నిందితుడు పాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

 

Kenya cult death toll surpasses 200, besides more than 600 people reported missing krj
Author
First Published May 15, 2023, 5:06 AM IST

ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర విషాదం వెలుగులోకి వచ్చింది. ఓ చర్చి పాస్టర్ మాటలు విని ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు తీసుకొన్నారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంతకీ.. ఆ పాస్టర్‌ ఏం చేశాడు..? ఎందుకు అంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ? అసలేం జరిగింది?

వివరాల్లోకెళ్తే.. ఈ మొత్తం విషాదం.. కెన్యాలోని కిలిఫీ కౌంటీ ప్రాంతంలోని షకహోలా గ్రామంలో చోటుచేసుంది. ఇక్కడ పాస్టర్ పాల్ మాకెంజీ న్తెంగే గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిని నడిపేవారు. ఈ పాస్టర్ ప్రార్థన కోసం ప్రజలను సేకరించేవారు. ఆకలితో అలమటించి చనిపోతే జీసెస్‌ను కలుస్తారని, తద్వారా వారు ప్రపంచం అంతమయ్యేలోపు స్వర్గానికి వెళ్ళవచ్చని తన అనుచరులను నమ్మించారు. ఈ పాస్టర్ మాటలను గుడ్డిగా నమ్మి నిరాహార దీక్ష చేయడంతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఇందులో పురుషులు, మహిళలు , పిల్లలు ఉన్నారు.

అసలు విషయం ఎలా వెలుగులోకి..

నిజానికి పాస్టర్ మాటలు నమ్మి, ఇక్కడి  ప్రజలు తినడం మానేశారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించారు. ఆకలి వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేశారు. పోలీసులు వారందరినీ ఆసుపత్రికి తరలించారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడైన పాస్టర్‌ను ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడిని విచారిస్తున్నారు. పాస్టర్ తో పాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో షాకహోలా అటవీప్రాంతంలో పోలీసులు ఇప్పటివరకు 201 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో పోలీసులు ఇప్పటివరకు 58 సమాధులను గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ముగ్గురు పిల్లలు, వారి తల్లిదండ్రులను ఒకే సమాధిలో పూడ్చిపెట్టినట్లు చెబుతున్నారు. 

దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించారు. చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అయితే.. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు గుర్తించడం సంచలనంగా మారింది. వీరంతా పాస్టర్ మాటలు విని ఉప వాసం చేసి ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది గల్లంతయ్యారు ఫిర్యాదు చేశారు. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.  

 ఇదిలా ఉంటే.. పాస్టర్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అతని చర్చి 2019 సంవత్సరంలోనే మూసివేయబడినట్టు తెలిపారు. అయితే పాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. గతంలో నిందితుడు పాస్టర్ పాల్ మాకెంజీ న్తెంగే ఇద్దరు పిల్లలను ఆకలితో చనిపోయారనే ఆరోపణలపై మార్చి 2023లో అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత కోర్టు నుంచి బెయిల్ పొందాడు.

Follow Us:
Download App:
  • android
  • ios