భారత్‌లో జీప్ కంపాస్ బెడ్‌రాక్ విడుదల, ధర తెలుసా?

Jeep India Launches Compass Bedrock Limited Edition
Highlights

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జీప్, భారత మార్కెట్లో మరో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. 

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జీప్, భారత మార్కెట్లో మరో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. జీప్ కంపాస్ బెడ్‌రాక్ ఎడిషన్ పేరిట ఈ మోడల్‌ను విడుదల చేశారు. దేశీయ విపణిలో ఈ కారు ధరను రూ. 17.53 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.

కంపాస్ మోడల్‌లో విక్రయిస్తున్న స్పోర్ట్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ బెడ్‌రాక్ లిమిటెడ్ ఎడిషన్‌ను తయారు చేశారు. ఇండియాలో 25,000 యూనిట్ల కంపాస్ మోడల్ కార్లను విక్రయించిన సందర్భంగా జీప్ ఇండియా ఈ బెడ్‌రాక్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

జీప్ కంపాస్ బెడ్‌రాక్ లిమిటెడ్ మూడు రంగులలో లభిస్తుంది. అవి వోకల్ వైట్, మినిమల్ గ్రే, ఎగ్జోటిక్ రెడ్. స్పెషల్ ఎడిషన్‌కు తగ్గట్లుగానే ఇందులో అనేక కాస్మోటిక్ మార్పులు ఉంటాయి. ఈ కారులో 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 173 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 

ఈ కారులో ఇంకా ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ టక్సన్, మహీంద్రా ఎక్స్‌యూవీ500, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లతో ఈ జీప్ కంపాస్ తలపడనుంది.

loader