Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్ ఆర్డర్ చేస్తే.. అందులో బతికున్న కప్ప కనిపించడంతో..!

పాపం ఆ వ్యక్తి దానిని చూసుకోకుండా సగందాకా తినేశాడు. తీరా సగం తిన్న తర్వాత చూస్తే ఏదో కదులుతున్నట్లుగా అందులో ఏదో కనిపించింది. తీరా చూస్తే అందులో కప్ప కనపడటం విశేషం.

Japanese man finds live frog in takeaway udon cup. Restaurant apologises after video goes viral ram
Author
First Published May 31, 2023, 10:54 AM IST

మనలో చాలామంది రెస్టారెంట్ లలో ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. అలా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక్కోసారి పొరపాటున ఫుడ్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అయితే, ఓ వ్యక్తి ఫుడ్ లో మాత్రం ఏకంగా బతికున్న కప్ప వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఒక జపనీస్ వ్యక్తి ఒక ప్రముఖ రెస్టారెంట్ చైన్ నుండి టేక్‌అవేకి ఆర్డర్ ఇచ్చాడు.  అతను ఒక కప్పు ఉడాన్ నూడిల్స్ ఆర్డర్ చేశాడు. ఆ నూడిల్స్ లో కూరగాయలతో పాటు ఒక బతికున్న కప్ప కూడా ఉండటం గమనార్హం. పాపం ఆ వ్యక్తి దానిని చూసుకోకుండా సగందాకా తినేశాడు. తీరా సగం తిన్న తర్వాత చూస్తే ఏదో కదులుతున్నట్లుగా అందులో ఏదో కనిపించింది. తీరా చూస్తే అందులో కప్ప కనపడటం విశేషం.

 ఉడాన్ అనేది గోధుమ పిండితో తయారు చేయబడిన మందపాటి నూడిల్, దీనిని జపనీస్ వంటకాలలో ఉపయోగిస్తారు. కైటో అనే వ్యక్తి వ్యాపార పర్యటనలో ఉండగా, అతను ప్రముఖ రెస్టారెంట్ చైన్ నుండి టేకావేని ఆర్డర్ చేశాడు.అయితే, అందులో కప్ప కదులుతూ ఉండటాన్ని చూసి అతను భయపడిపోయాడు.

 

 ఉడాన్‌లో స్పెషలిస్ట్ అయిన  జపనీస్ ఫాస్ట్-క్యాజువల్ రెస్టారెంట్ చైన్ అయిన మారుగేమ్ సీమెన్ నుండి ఆహారం ఆర్డర్ చేయడం విశేషం. ఈ వీడియోని ఆయన సోషల్ మీడీయాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. వెంటనే అతను ఫిర్యాదు చేయగా, దానిని మూసివేశారు.

చాలా మంది నిజంగా బతికున్న కుప్ప ఉందంటే నమ్మలేదు. కావాలనే ఆ రెస్టారెంట్ పై చెడు ప్రభావం  పడాలని చూస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios